AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు విముక్తి..

1982లో మొదలైన ఒక హత్య కేసు.. ఏకంగా 42 ఏళ్ల పాటు సాగి, నిందితుడికి 100 ఏళ్ల వయసు వచ్చాక ముగిసింది. తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని నిందితుడు అనే ముద్రతో గడిపిన ఆ వృద్ధుడిని అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇంతకీ ఆ వందేళ్ల తాత చేసిన తప్పేంటి?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు విముక్తి..
Allahabad High Court Acquits Centenarian
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 1:12 PM

Share

న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయం నిరాకరించబడటమే అనే నానుడి ఈ కేసు విషయంలో అక్షరాలా నిజమైంది. దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. తన జీవితంలో వంద వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు చెందినది. 1982లో ఒక భూ వివాదంలో జరిగిన హత్యకు సంబంధించి ధని రామ్, సత్తి దీన్, మైకు అనే ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలు వచ్చాయి. హమీర్‌పూర్ సెషన్స్ కోర్టు ధని రామ్, సత్తి దీన్‌లకు 1984లో జీవిత ఖైదు విధించింది. దీనిని సవాలు చేస్తూ ధని రామ్ అదే ఏడాది అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యారు.

40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం

కేసు పెండింగ్‌లో ఉండగానే సహ నిందితుడు సత్తి దీన్ మరణించారు. ప్రధాన నిందితుడు మైకు పరారీలో ఉన్నాడు. చివరికి ఈ కేసులో ధని రామ్ మాత్రమే ఏకైక అప్పీలుదారుగా మిగిలిపోయారు. నాలుగు దశాబ్దాలు గడిచినా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ధని రామ్ ఎన్నో సామాజిక ఇబ్బందులను, మానసిక ఆందోళనను అనుభవించారు.

హైకోర్టు ఏమంది?

జస్టిస్ చంద్ర ధారి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ నిందితుడిపై ఉన్న ఆరోపణలను సహేతుకమైన సందేహానికి మించి నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. ఒక వ్యక్తి 40 ఏళ్ల పాటు నిందితుడిగా ముద్ర వేయించుకుని సమాజంలో ఎదుర్కొన్న అవమానాలు, అనిశ్చితిని కోర్టు విస్మరించలేదని తెలిపింది. ధని రామ్ వయస్సు, కేసు పెండింగ్‌లో ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అతని బెయిల్ బాండ్లను రద్దు చేసి, వెంటనే నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశించింది.

న్యాయవాది వాదన

విచారణ సందర్భంగా ధని రామ్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం తన క్లయింట్ వయస్సు 100 ఏళ్లు ఉంటుందని, కేవలం మైకును ప్రేరేపించాడనే ఆరోపణతో ఇన్నాళ్లు శిక్ష అనుభవించడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు న్యాయం గెలిచినప్పటికీ, ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విలువైన 40 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ గడపాల్సి రావడం మన న్యాయవ్యవస్థలోని జాప్యానికి అద్దం పడుతోంది.

Follow Us
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..