AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండడు..! తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తక్కువ సమయంలోన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు స్టార్ హీరోస్ అందరి సరసన అవకాశాలు అందుకుంది. పాన్ వరల్డ్ హీరోయిన్ ఆమె.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..

ఆమె అందానికి పడిపోని కుర్రాడు ఉండడు..! తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2026 | 12:55 PM

Share

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సెలబ్రెటీల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు వైరల్ అవుతుంటాయి. ఎంతో మంది సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోలు, నెట్టింట షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. తల్లి ఒడిలో కూర్చొని పుట్టినరోజు కేక్ కట్ చేస్తున్న ఈ క్యూట్ బేబీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ప్రపంచ వ్యాప్తంగా ఆమె అందాన్ని పొగిడారు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ . తన అందం, అభినయంతో సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది ఆమె మరెవరో కాదు.. అప్సరస ఐశ్వర్య రాయ్ బచ్చన్..

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

పిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, తన అందం అభినయంతో ప్రపంచవ్యాప్త క్రేజ్ సొంతం చేసుకుంది. అందాల పోటీలకు సంబంధించి విశ్వ వేదికపై మన దేశం పేరు మారుమ్రోగేలా చేసింది. ఆమె కళ్ళు, చిరునవ్వుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఐదు పదుల వయసులోనూ తరగని అందంతో కవ్విస్తుంది. ఆమె వయసుతో పాటు అందము పెరుగుతుందని అభిమానులు మురిసిపోతుంటారు. నేటికీ అదే అందం, అభినయంతో మహారాణిగా వెలుగొందుతున్న ఐశ్వర్య రాయ్  చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడానికి ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడింది. 1994లో ఆమె మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఆమె సినీ రంగ ప్రవేశానికి బలమైన పునాది వేసింది. 1997లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఇరువర్ (తెలుగులో ఇద్దరు) సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి వరుస విజయాలను అందుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ వంటి చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. భారతీయ చిత్ర పరిశ్రమలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఐశ్వర్య రాయ్ తనదైన ముద్ర వేసింది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యురాలిగా గౌరవం పొందిన ఏకైక భారతీయ హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది. వ్యక్తిగత జీవితంలో, ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకొని, ఒక పాప ఆరాధ్యకు తల్లిగా మారింది.  వివాహం తర్వాత సినిమాలను అడపాదడపా మాత్రమే చేస్తూ, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తోంది ఐశ్వర్య రాయ్.

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!