AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను నటుడిగా తీర్చిదిద్దింది ఆయనే.. అతని వల్లే సినిమాల్లో రాణించగలిగా..

విలన్ గా భయపెడుతూనే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు నర్సింగ్ యాదవ్. ఆయన అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోవడంతో సినీలోకం దిగ్బ్రాంతికి గురైంది. 2020లో నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నన్ను నటుడిగా తీర్చిదిద్దింది ఆయనే.. అతని వల్లే సినిమాల్లో రాణించగలిగా..
Narsing Yadav
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2026 | 1:13 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందిన నటుడు నర్సింగ్ యాదవ్. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఇప్పటికీ ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా గతంలో నర్సింగ్ యాదవ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ (RGV) గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇండస్ట్రీలోకి నటుడిగా రావాలని రాలేదని, కానీ నటన స్టార్టింగ్ లోనే RGV ప్రభావం తనపై ఎంతగానో పడిందని నర్సింగ్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన తన గురువు అని, చనిపోయే వరకు కూడా వంద మంది అడిగినా రామ్ గోపాల్ వర్మనే తన నటనకు గురువు అని చెబుతానని అన్నారు.

ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

నరసింగ్ యాదవ్ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు వంద మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య నిలబడేవాడినని తెలిపారు. కెమెరా దగ్గరికి వచ్చి నటించే అవకాశం కూడా అప్పుడు రాలేదని చెప్పారు. RGVనే తనకు ఆ అవకాశాన్ని కల్పించారని అన్నారు. క్షణ క్షణం సినిమా షూటింగ్ మొదటి రోజు అనుభవాన్ని ఆయన వివరించారు. తొలి షాట్ లోనే వర్మ తనకు నటనలోని కీలక పాఠాలను నేర్పించారని వివరించారు.  నేను నిన్ను తీసుకుంది నీ  కళ్ళు బాగున్నాయని” అన్నారని నర్సింగ్ యాదవ్ గుర్తుచేసుకున్నారు. సులభమైన పద్ధతిలో నటనను నేర్పించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని, ఆయన వల్లే తాను నటుడిగా నిలదొక్కుకోగలిగానని నర్సింగ్ యాదవ్ అన్నారు.

ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా

కేవలం నటనలోని మెళకువలే కాకుండా, సన్నివేశంలో భావోద్వేగాలను ఎలా పలికించాలో కూడా వర్మ నేర్పించారని తెలిపారు. ఒక కత్తిపోటు సన్నివేశంలో తాను కూరగాయలు కోసినట్లు నటించగా, RGV మందలించి, “ఇలా కాలర్ పట్టుకోవాలి. ఇలా పొడవాలి, ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉండాలి,” అని చెప్పారని గుర్తుచేసుకున్నారు.  ఆర్జీవీతో సినిమాలు చూస్తే, ఆయన క్యారెక్టర్లకు హీరోయిజం ఇస్తారని, హీరో హీరోయిన్లను కూడా పట్టించుకోకుండా క్యారెక్టర్లను అద్భుతంగా తీర్చిదిద్దుతారని నర్సింగ్ యాదవ్ ప్రశంసించారు. శివ సినిమాలో ఉతేజ్, జేడీ చక్రవర్తి పాత్రలను ఆయన తీర్చిదిద్దిన విధానం అద్భుతమని, క్యారెక్టర్ ఆర్టిస్టులను హీరోలుగా మార్చగల సత్తా వర్మకు ఉందని పేర్కొన్నారు. తాను ఏమీ తెలియనివాడినైనప్పటికీ, ఆర్జీవీ తనను నటుడిగా తీర్చిదిద్దారని నర్సింగ్ యాదవ్ తెలిపారు. ఆయన నేర్పిన పాఠాలు తన సినీ జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని కృతజ్ఞతలు తెలిపారు నర్సింగ్ యాదవ్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నన్ను నటుడిగా తీర్చిదిద్దింది ఆయనే..
నన్ను నటుడిగా తీర్చిదిద్దింది ఆయనే..
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!