AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance: భారతీయుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పర్సనల్‌ ఫైనాన్స్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

దేశంలోనే మొట్టమొదటి ఇండిపెండెంట్ పర్సనల్ ఫైనాన్స్ సర్వే భారతదేశం ఎలా సంపాదిస్తుంది.. ఎంత ఖర్చు చేస్తుంది.. ఎంత పొదుపు చేస్తుంది.. ఎంత పెట్టుబడి..

Personal Finance: భారతీయుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పర్సనల్‌ ఫైనాన్స్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు
Personal Finance Survey
Subhash Goud
|

Updated on: Nov 06, 2022 | 11:50 AM

Share

దేశంలోనే మొట్టమొదటి ఇండిపెండెంట్ పర్సనల్ ఫైనాన్స్ సర్వే భారతదేశం ఎలా సంపాదిస్తుంది.. ఎంత ఖర్చు చేస్తుంది.. ఎంత పొదుపు చేస్తుంది.. ఎంత పెట్టుబడి పెడుతుంది ఇటువంటి అనేక అంశాలను మనకు వివరిస్తుంది. సాధారణంగా మనం ఎంత సంపాదించినా.. అది తక్కువగా ఉందనే భావిస్తాం. మన సంపాదనకూ.. ఖర్చులకూ పొంతన లేదనీ.. ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ అనుకోవడం సహజం. మరి వాస్తవానికి సగటు భారతీయ కుటుంబం నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? లేదా.. కుటుంబ సగటు ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అనే విషయం మీకు తెలుసా..? తక్కువ సంపాదన కలిగిన కుటుంబాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది అనే విషయం గురించి మీరేపుడైనా విన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి మనీ 9 భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద వ్యక్తిగత ఫైనాన్స్ సర్వేను తీసుకువచ్చింది.

ఇది మీ దేశ ఆదాయాలు, ఖర్చులు, వినియోగం, పొదుపులు, పెట్టుబడి, రుణ ప్రవర్తనకు సంబంధించిన అనేక సమాచారాన్ని అందిస్తుంది. సర్వేలో వెలుగులోకి వచ్చిన అనేక విషయాలను మీతో పంచుకుంటున్నాం. ఈ ప్రత్యేక సెగ్మెంట్ అనేక భాగాలుగా విభజించబడింది. మొదటగా భారతదేశం ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం.

భారతదేశంలోని కుటుంబాల సగటు ఆదాయం ఎంత..? కుటుంబ ఆదాయం కంటే ముందు భారతదేశంలోని కుటుంబం సగటు పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవాలి? అంటే, ఒక నిర్దిష్ట కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మనం భారతీయ కుటుంబం పరిమాణం గురించి చూస్తే .. భారతదేశంలో ఒక కుటుంబం ఎంత సంపాదిస్తుంది అనే విషయంలో సర్వేలో తేలిన దాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో సగటు కుటుంబం నెలకు రూ.23000 సంపాదిస్తుంది. ఒక కుటుంబం మొత్తానికి ఇంత తక్కువ సంపాదన ఎందుకు అనే విషయాన్ని గమనిస్తే.. భారతదేశ జనాభాలో ఎక్కువ మంది శ్రామిక లేదా మధ్యతరగతికి చెందినవారు ఉన్నారు. ఇక సంపాదన పరంగా కుటుంబాలను నాలుగు తరగతులుగా విభజించారు.

ఇవి కూడా చదవండి

☛ 46% కుటుంబాలు నెలలో 15 వేల కంటే తక్కువ సంపాదిస్తున్నాయి. ఇది ఔత్సాహిక తరగతి.

☛ 40% కుటుంబాలు నెలకు 15-35 వేల మధ్య సంపాదిస్తున్నాయి. ఇవి తక్కువ మధ్య తరగతికి చెందినవి.

☛ నెలకు 35-50 వేలు సంపాదించే 8% కుటుంబాలు ఉన్నాయి. ఇవి మధ్యతరగతి వారు ఉన్నారు.

☛ చివరకు 6% కుటుంబాలు నెలకు 50 వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాయి.. ఇవి ధనిక/అధిక మధ్యతరగతికి చెందినవి.

☛ ఈ వివరాల ద్వారా మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే దాదాపు సగం భారతీయ కుటుంబాలు నెలకు INR 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు.

భారతదేశం ఎలా సంపాదిస్తారో ఇప్పుడు మనకు తెలుసు. ఇందులో భాగంగా మరో రెండు విషయాలను తెలుసుకుందాం. మొదటిది విషయం కనీస వేతనం.. ఇప్పుడు ఈ గణాంకాలు స్థానిక గణాంకాలు. ఢిల్లీ గురించి చెప్పాలంటే.. ఢిల్లీలో సగటు రోజువారీ వేతనం నైపుణ్యం లేని వారికి 646, సెమీ స్కిల్డ్‌కు 712, నైపుణ్యం కలిగిన కార్మికులకు 783. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో నైపుణ్యం లేనివారు – 374, సెమీ స్కిల్డ్ 412, నైపుణ్యం కలిగిన కార్మికుల సగటు రోజువారీ వేతనం 461. ఇక బీహార్‌లో నైపుణ్యం లేనివారు 366, సెమీ స్కిల్డ్- 380, నైపుణ్యం 463. ఇప్పుడు ఇవి కేంద్ర గణాంకాలు.. మరికొన్ని రాష్ట్రాలు.. భారతదేశం ఎలా సంపాదిస్తుంది అనే దాని మీకు జాతీయ స్థాయిలో హైలైట్స్ ఇచ్చాము. ఇది చాలా పెద్దది. మీరు ఈ విషయంలో మీ రాష్ట్రం గురించి తెలుసుకోవాలని అనుకుంటే మీ రాష్ట్రం కనీస వేతన పరంగా ఎక్కడ ఉంది. అలాగే అనేక ఇతర ఆదాయ ప్రమాణాలు వంటివి తెలుసుకోవాలని భావిస్తే.. మీరు Money9 ద్వారా భారతదేశపు మొదటి వ్యక్తిగత ఆర్థిక సర్వేను ట్యూన్ చేయవచ్చు. ఇది ఇప్పుడు Money9 అన్ని ఇతర TV9 నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి