2024 Kawasaki W175: క్రేజీ లుక్‌లో కవాసకి బైక్.. రూ. 25,000 తగ్గింపు కూడా.. పూర్తి వివరాలు
ఇటీవలె మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ 2024 కవాసకి న్యూ స్ట్రీట్ వెర్షన్ డబ్ల్యూ175లోని స్టాండర్డ్ వేరియంట్ కొనుగోలుపై వినియోగదారులకు రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ను రూ. 1.22లక్షల(ఎక్స్ షోరూం)కే కొనుగోలు చేయొచ్చు. ఇది ప్రారంభ ధర కాగా.. హై ఎండ్ వెర్షన్ రూ. 1.31లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

మన దేశంలో కవాసకి మోటార్ సైకిల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అధిక పనితీరుతో పాటు అనువైన బడ్జెట్లో ఈ కంపెనీ బైక్ లు అందుబాటులో ఉంటాయి. కవాసకి నుంచి ఇక్కడ అమ్ముడవుతున్న బైక్ లలో డబ్ల్యూ175 ఒకటి. ఇది రెట్రో స్టైల్ బైక్. దీనిని రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ 225 బైక్ లకు పోటీగా కవాసకి దీనిని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఎబనీ, క్యాండీ పెర్సిమన్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ధర రూ. 1.22లక్షల నుంచి రూ. 1.24లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంది. ఈ క్రమంలో కంపెనీ దీనిని అప్ గ్రేడ్ చేసింది. 2024 కవాసకి న్యూ స్ట్రీట్ వెర్షన్ డబ్ల్యూ175గా దీనిని రీలాంచ్ చేసింది. మరో రెండు కొత్త మెటాలిక్ కలర్ ఆప్షన్లలో 2024 మోడల్ ను తీసుకొచ్చింది. గ్రాఫైట్ గ్రే షేడ్ ధర రూ. 1.29లక్షలు, ఓషన్ బ్లూ కలర్ ధర రూ. 1.31లక్షలు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ కొత్త వెర్షన్ లో ఎటువంటి మార్పులు చేసిందో తెలుసుకుందాం..
మార్పులు ఇవే..
2024 కవాసకి డబ్ల్యూ175 స్పోక్డ్ వీల్ వెర్షన్ లో మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు. దీనిలో 177సీసీ సింగిల్ సిలెండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఇది 7000ఆర్పీఎం వద్ద 12.9బీహెచ్పీ, 6000ఆర్పీఎం వద్ద 13.2ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కెర్బ్ వెయిట్ 135కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది బైక్ ని తెలికగా మార్చేసింది. కఠినమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరుని కనబరుస్తుంది.
ఈ బైక్ పాత మోడల్లో లాగే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు వైపు 270ఎంఎం డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. సింగిల్ చానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా ఉంటుంది. కొత్తగా విడుదలైన ఈ బైక్ సీట్ ఎత్తు 790ఎంఎం ఉంటుంది. పాత మోడళ్లతో పోల్చితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది.
రూ. 25,000 తగ్గింపు..
ఇటీవలె మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ 2024 కవాసకి న్యూ స్ట్రీట్ వెర్షన్ డబ్ల్యూ175లోని స్టాండర్డ్ వేరియంట్ కొనుగోలుపై వినియోగదారులకు రూ. 25,000 తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ను రూ. 1.22 లక్షల(ఎక్స్ షోరూం)కే కొనుగోలు చేయొచ్చు. ఇది ప్రారంభ ధర కాగా.. హై ఎండ్ వెర్షన్ రూ. 1.31లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




