AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pensioners: పెన్షనర్లకు శుభవార్త..! జీవిత భాగస్వామి లేనప్పుడు ఇది తప్పనిసరి కాదు..

Pensioners: పెన్షన్ దారులకు శుభవార్త. ఇప్పుడు జీవిత భాగస్వామి పెన్షన్ కోసం ఉమ్మడి బ్యాంకు ఖాతా తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు

Pensioners: పెన్షనర్లకు శుభవార్త..! జీవిత భాగస్వామి లేనప్పుడు ఇది తప్పనిసరి కాదు..
Pension
uppula Raju
|

Updated on: Nov 21, 2021 | 6:06 AM

Share

Pensioners: పెన్షన్ దారులకు శుభవార్త. ఇప్పుడు జీవిత భాగస్వామి పెన్షన్ కోసం ఉమ్మడి బ్యాంకు ఖాతా తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారి జీవితాన్ని సులభతరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఉద్యోగులు చేసిన సుధీర్ఘ సేవలను, అనుభవాన్ని పరిగణలోనికి తీసుకొని వారు దేశానికి విలువైన వారని అభివర్ణించారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రభుత్వోద్యోగి తన జీవిత భాగస్వామితో ఏ కారణం చేతనైనా జాయింట్ ఖాతాను తెరవడం సాధ్యం కాకుంటే బాధపడనవసరంలేదని తెలిపింది. పింఛను పొందేందుకు జీవిత భాగస్వామి ప్రస్తుత జాయింట్ బ్యాంక్ ఖాతాను ఎంచుకుంటే పర్వాలేదు కానీ బ్యాంకులు కొత్త ఖాతా తెరవాలని మాత్రం పట్టుబట్టకూడదని బ్యాంకులకు సూచించింది. అయితే జీవిత భాగస్వామితో జాయింట్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం మంచిదని అభిప్రాయపడింది.

PPOలో జాయింట్ ఖాతా అవసరం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO)లో జీవిత భాగస్వామితో కుటుంబ పెన్షన్ కోసం ఉమ్మడి ఖాతాను కలిగి ఉండటం అవసరం. కానీ ఇది పెన్షనర్ల కోరికపై ఆధారపడి ఉంటుంది. పెన్షనర్ మరణించిన సందర్భంలో జీవిత భాగస్వామి పెన్షన్ పొందడంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉమ్మడి ఖాతా ఓపెన్ చేస్తారు. పింఛనుదారులకు ఉపశమనం కలిగించడమే దీని ఉద్దేశం తప్ప వారికి సమస్యలు సృష్టించడం కాదని స్పష్టం చేసింది.

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?