Jio Prepaid Plans: రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్స్
Jio Prepaid Plans: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో దేశీయ టెలికాం కంపెనీలు రియలన్స్ జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel),..
Jio Prepaid Plans: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. గత సంవత్సరం నవంబర్ నెలలో దేశీయ టెలికాం కంపెనీలు రియలన్స్ జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) టారీఫ్ ప్లాన్స్‌ను మార్చాయి. బెనిఫిట్స్ తగ్గించి ధరలు పెంచేశాయి. రీచార్జ్ ప్లాన్స్ ధరలు (Recharge Plans)రెట్టింపు అయ్యాయి. అయితే ఇతర టెలికాం కంపెనీల పోటీ నుంచి తట్టుకునేందుకు రిలయన్స్ జియో కస్టమర్లకు బరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.200లలోపు ఉన్న టారిఫ్ ప్లాన్స్‌కు ప్రతి రోజు 1జీబీ డేటా అందిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వెయ్యి నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది జియో. ఇందులో భాగంగా 4జీ టారిఫ్ రేట్లను సైతం పెంచి 5జీపై ఇన్వెస్ట్‌మెంట్ చేస్తోంది. దీంతో జియో యూజర్లకు తక్కువ ధరల్లో సరికొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది.
రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ప్రతి రోజు1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతి రోజు 100 SMSలను అందిస్తోంది. 20 రోజుల వ్యాలిడిటీతో జియో మూవీస్, జియో క్లౌడ్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక రూ.179 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 24 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 1జీబీ డేటా, రోజు 100SMSలు, అన్‌మిలిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీని పెంచుకునేందుకు అదనంగా రూ.149 రీచార్జ్ చేసుకోవచ్చు. ఇక రూ.209 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజు 1జీబీ డేటా, ఆన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జియో మూవీస్, జియో క్లౌడ్‌తో పాటు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే వొడాఫోన్ ఐడియా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.269 వసూల చేస్తోంది. ఇందులో బేసిగ్గా ఉండే ప్రయోజనాలు అందిస్తోంది. రూ.119 ప్లాన్స్‌తో 1.5జీబీడేటాతో ఆన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. ఇక రూ.119 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 23 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. అలాగే ప్రతి రోజు 100SMSలు అందిస్తోంది.
ఇవి కూడా చదవండి: