AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioHotstar: బిగ్ బాస్ వచ్చేసింది.. రూ.100 కే 90 రోజులు చూడొచ్చు.. ఎలాగంటే..?

జియో హాట్‌స్టార్‌లో మీకు ఇష్టమైన సినిమా లేదా షో చూడాలనుకుంటున్నారా..? కానీ సబ్‌స్క్రిప్షన్ లేదా? అయితే చింతించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.100 కే 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ చూడొచ్చు. అదనంగా డేటా కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

JioHotstar: బిగ్ బాస్ వచ్చేసింది.. రూ.100 కే 90 రోజులు చూడొచ్చు.. ఎలాగంటే..?
Jio And Airtel Plans With Free Hotstar
Krishna S
|

Updated on: Sep 06, 2025 | 3:16 PM

Share

ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. ఇంటి వద్దే కూర్చుని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి చాలా మంది జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే చాలా మందికి ఈ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఖరీదైనదిగా అనిపించవచ్చు. అలాంటి వారి కోసమే టెలికాం సంస్థలు అతి తక్కువ ధరకే కొన్ని ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చాయి. కేవలం రూ.100 లోపే లభించే ఈ ప్లాన్‌లతో డేటాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్ వంటి వాటి సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియాఅందిస్తున్న అలాంటి కొన్ని ఉత్తమ ప్లాన్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 100 ప్లాన్

జియో అందిస్తున్న రూ. 100 ప్లాన్ అత్యంత ఆకర్షణీయమైనది. ఈ ప్లాన్‌తో మీకు 5 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటీటీ ప్రయోజనం. కేవలం రూ.100తో మీకు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇది మొబైల్‌తో పాటు టీవీలో కూడా చూడవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 100 ప్లాన్

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.100 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మీకు 5 జీబీ హై స్పీడ్ డేటా, జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. కానీ జియో ప్లాన్‌తో పోలిస్తే.. ఈ ప్లాన్ కేవలం 30 రోజుల వాలిడిటీని మాత్రమే అందిస్తుంది. కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉండవు. ఇది మొబైల్‌లో మాత్రమే చూడొచ్చు.

వీఐ రూ. 151 ప్లాన్

వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్ పైన పేర్కొన్న ప్లాన్‌ల కంటే రూ. 51 ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇది మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రూ. 151 ప్లాన్‌తో మీకు 4 జీబీ డేటా లభిస్తుంది. జియో హాట్‌స్టార్‌ను 90 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు.

ఈ ప్లాన్‌లను ఉపయోగించుకోవడానికి, మీ నంబర్‌లో ఇప్పటికే ఒక బేసిక్ రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. ఈ డేటా ప్లాన్‌లతో కాల్స్ లేదా ఎస్ఎంఎస్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ఈ ప్లాన్‌లు కేవలం అదనపు డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించడానికి మాత్రమే తీసుకొచ్చాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి