Jeep : ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జీప్‌ కంపెనీ.. 2023 లో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల..

Jeep :  పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. అతిగా కార్బన్‌ ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి విడుదలయ్యే

Jeep : ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి జీప్‌ కంపెనీ..  2023 లో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల..
Jeep
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 3:05 PM

Jeep :  పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. అతిగా కార్బన్‌ ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఈ రంగంలోకి జీప్ కంపెనీ కూడా చేరింది. 2023లో తన మొదటి ఎలక్ట్రిక్‌ జీప్‌ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ వాహనం గురించి మాట్లాడుకుంటే ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం, రిమోట్ వాహన ట్రాకింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి అనేక ఫీచర్లతో వస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం 35.5 బిలియన్ డాలర్లు ఖర్చు.. జీప్ మాతృ సంస్థ స్టెల్లంటిస్ ప్రకారం.. వచ్చే రెండు సంవత్సరాలలో 21 వాహనాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాలపై సుమారు $ 35.5 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2025 నాటికి మొత్తం ప్రపంచ అమ్మకాలలో 70% ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురావాలని ఈ కంపెనీ భావిస్తోంది.

మొదటి ఎలక్ట్రిక్ జీప్ రాంగ్లర్ జీప్ రాంగ్లర్ ఇప్పటికే చైనా, ఐరోపాలో హైబ్రిడ్ 4xe కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇతర ఎలక్ట్రిక్ జీప్ మోడళ్లలో, ప్లస్-ఇన్ హైబ్రిడ్ ఎంపికలతో కంపాస్, రెనెగేడ్ అందుబాటులో ఉన్నాయి. జీప్ కమాండర్ PHEV చైనాలో విక్రయిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్‌ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కార్ల ధర కూడా అతి తక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మార్కెట్ వర్గాల ప్రకారం తమ ఎలక్ట్రిక్‌ కార్లను రూ.10 లక్షల లోపే ఉండేలా కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు

Officers Fight: విశాఖ దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట, ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక, మట్టి విసిరిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

Ancient Shiva Linga: మహిమాన్విత దేవుడిగా క్రైస్తవులతో పూజలందుకుంటున్న శివలింగం.. ఏ దేశంలోనంటే..