Jio: జియో మరో సంచలనం.. కేవలం 24 రూపాయలు మాత్రమే.. ప్రత్యేక ఆఫర్!
Jio: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రీఛార్జ్ ప్లాన్స్ కాకుండా ఇతర సదుపాయాలను కూడా ప్రవేశపెడుతుంటుంది. ఇప్పుడు రీఛార్జ్ చేసుకునే వారికి కాకుండా వారి కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది..

Jio Offer: రిలయన్స్ జియో. టెలికాం రంగంలో ఒక సంచలనం సృష్టిస్తోంది. వినియోదారులను ఆకట్టుకునేందుకు రకరకాల అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. తక్కువ ధరల్లోనే ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ కాకుండా ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో కూడా ఓ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. మీరు జరిమానా నుండి తప్పించుకోవాలనుకుంటే చివరి తేదీకి ముందే మీ ITR ని దాఖలు చేయండి. ముఖేష్ అంబానీ కంపెనీ జియోఫైనాన్స్ రిటర్న్‌లను దాఖలు చేసే వారి కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు మీరు కేవలం 24 రూపాయలకే ITR ని దాఖలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్ 30న పాఠశాలలు బంద్.. వరుసగా 2 రోజులు సెలవులు
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. జియో ఫైనాన్స్ యాప్ టాక్స్ బడ్డీ సహకారంతో ఒక సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద మీరు పన్ను ప్రణాళిక, దాఖలు చేయవచ్చు. ఈ సౌకర్యానికి ఛార్జీ కేవలం 24 రూపాయలు మాత్రమే.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇది అదిరే శుభవార్త అనే చెప్పాలి. జియో ఫైనాన్స్ యాప్ ద్వారా కొత్త ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్ ఫీచర్ తెచ్చింది. ట్యాక్స్ పేయర్లు ఈ యాప్ ద్వారా పన్ను విధానం ఎంచుకోవడంతో పాటుగా గరిష్ఠ మినహాయింపులు పొందేందుకు సహాయం చేయనున్నట్లు జియోఫైనాన్స్ పేర్కొంటోంది.
జియో ఫైనాన్స్ రూ.24 ప్లాన్ ఎవరికి వర్తిస్తుంది?
ఇది ఒక బేసిక్ ప్లాన్. రూ.24 ప్లాన్ అనేది కేవలం ఐటీఆర్-1 ఫైలింగ్ కోసం మాత్రమే వర్తిస్తుంది. అంటే కేవలం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండి ఒకే ఫారం 16 అందుకునే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా సీఏ సహాయం ఉండదు. ట్యాక్స్ పేయర్ స్వయంగా ఫైలి చేయాల్సి ఉంటుంది. నిల్ ఐటీఆర్ లేదా సింపుల్ ఐటీఆర్ 1 ఫైలింగ్ చేసేందుకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇది బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ పెట్టుబడుల వంటి కాంప్లెక్స్ ట్యాక్సులు ఉన్న వారికి పని చేయదు. నిపుణుల సహాయం తీసుకోవాలని అనుకునే వారికి జియోఫైనాన్స్ రూ.999 ప్లాన్ అందిస్తోంది.
ఇది కూడా చదవండి: TVS EV: టీవీఎస్ నుంచి మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 158 కి.మీ.. తక్కువ ధరల్లోనే..
అయితే ఇందులో మీకు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) సహాయం లభించదు. కానీ, ఇప్పటివరకు ఇదే చౌకైన ప్లాన్. మరోవైపు Tax2Win వంటి ఇతర కంపెనీలు రూ. 49కి, MyITreturn రూ. 99కి అదే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌లలోనూ CA సహాయం అందుబాటులో లేదు. ఇక మీరు నిపుణుల సహాయంతో ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే జియో ఫైనాన్స్ రూ. 999 వసూలు చేస్తోంది. ఇదే సేవకు ట్యాక్స్ మేనేజర్ రూ. 1250 వసూలు చేస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. క్లియర్‌టాక్స్ రూ. 2539, టాక్స్‌బడ్డీ రూ. 999 వసూలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: TVS EV: టీవీఎస్ నుంచి మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 158 కి.మీ.. తక్కువ ధరల్లోనే..
మీరు జియో ఫైనాన్స్ యాప్‌తో మీ రీఫండ్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. మీ రీఫండ్ ఎప్పుడు వస్తుందో కూడా మీకు తెలుస్తుంది. దీనితో పాటు, మీరు ఆదాయపు పన్నుకు సంబంధించిన హెచ్చరికలు, నోటిఫికేషన్‌లను కూడా పొందుతారు. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో కూడా మీ రీఫండ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Viral Video: సంస్కారవంతమైన పామును మీరెప్పుడైనా చూశారా? మొబైల్‌లో రొమాంటిక్ పాటను చూసి ఏం చేసిందంటే..
ఇది కూడా చదవండి: Jio Plan: అంబానీయా మజాకా.. రూ.100తో డేటా ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








