AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITC: కోవిడ్ నివారణకు ఐటీసీ నాజల్ స్ప్రే.. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..

కోవిడ్-19 నివారణ కోసం నాజల్ స్ప్రేని అభివృద్ధి చేస్తున్నామని ఐటీసీ తెలిపింది. దీని కోసం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని ITC గురువారం ధృవీకరించింది...

ITC: కోవిడ్ నివారణకు ఐటీసీ నాజల్ స్ప్రే.. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..
Itc
Srinivas Chekkilla
|

Updated on: Nov 25, 2021 | 7:00 PM

Share

కోవిడ్-19 నివారణ కోసం నాజల్ స్ప్రేని అభివృద్ధి చేస్తున్నామని ఐటీసీ తెలిపింది. దీని కోసం క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని ITC గురువారం ధృవీకరించింది. బెంగళూరులోని ITC లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ (LSTC) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని వెల్లడించింది. అవసరమైన అన్ని నియంత్రణా అనుమతులు పొందిన తర్వాత, Savlon బ్రాండ్ క్రింద నాజల్ స్ప్రేని మార్కెట్‎లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుంది. ” నాజల్ స్ప్రే ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నందున మేము పూర్తి వివరాలను పంచుకోలేకపోతున్నాము.” అని ఐటీసీ ప్రతినిధి తెలిపారు.

“క్లినికల్ ట్రయల్ ఎక్కడ జరుగుతోంది. ఆమోదం తర్వాత ఉత్పత్తి ఎక్కడ నుండి జరుగుతుంది. నాజల్ స్ప్రే ఏ బ్రాండ్‌తో విక్రయిస్తారనేదానిపై వ్యాఖ్యానించడానికి ప్రతినిధి నిరాకరించారు. అయితే క్లినికల్​ ట్రయల్స్ కోసం నైతిక​ కమిటీల నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. ఈ మేరకు క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ-ఇండియాలో(సీటీఆర్​ఐ) నమోదైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వ్యాప్తిని నివారించడంలో ఈ స్ప్రే సమర్థంగా పని చేస్తుందని తెలిపారు. అయితే స్ప్రేతో పాటు ఇతర కొవిడ్ నిబంధనలు కూడా పాటించాలన్నారు.

Read Also.. Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..