Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Repair: వేడి నీటితో మీ కారు రిపేర్.. మెకానిక్ అవసరం లేదు.. రూపాయి కూడా ఖర్చు అవ్వద్దు..

కారుకు అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కారుకు అవుతాయి. వాటిని సరిచేయాలంటే అది ఆర్థికంగా చాలా భారం అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. ప్రమాదాల బారిన పడినప్పుడు అవి సాధారణంగా పగిలిపోవడం, సొట్టబడిపోవడం జరుగుతుంది. అయితే కారు పడిన ఈ నొక్కు(డెంట్)లను మీరు ఇంట్లో సులభంగా తొలగించుకోవచ్చు. దాని కోసం ఏ యంత్రాలు కూడా అవసరం లేదు.

Car Repair: వేడి నీటితో మీ కారు రిపేర్.. మెకానిక్ అవసరం లేదు.. రూపాయి కూడా ఖర్చు అవ్వద్దు..
Dent Repair On A Car
Follow us
Madhu

|

Updated on: Jun 07, 2024 | 4:32 PM

కారు వాడుతున్నప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో.. దాని మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రతి కారుకు రెగ్యూలర్ మెయింటెనెన్స్ అవసరం. లేకపోతే కండీషన్ తప్పుతుంది. అదే సమయంలో కారుకు అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కారుకు అవుతాయి. వాటిని సరిచేయాలంటే అది ఆర్థికంగా చాలా భారం అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. ప్రమాదాల బారిన పడినప్పుడు అవి సాధారణంగా పగిలిపోవడం, సొట్టబడిపోవడం జరుగుతుంది. అయితే కారు పడిన ఈ నొక్కు(డెంట్)లను మీరు ఇంట్లో సులభంగా తొలగించుకోవచ్చు. దాని కోసం ఏ యంత్రాలు కూడా అవసరం లేదు. కేవలం ఓ బాటిల్ వేడి నీటితో మీ కారును మళ్లీ మామూలుగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖరీదైనవి..

మీ కారు ఏదైనా చిన్న ప్రమాదానికి గురైనా.. లేక పొరపాటున ఏ ద్విచక్ర వాహనమో తగిలినా వెంటనే కారు పై బాడీ నొక్కుకుపోతుంది. అలాంటి సందర్భంలో మీరు కారును గ్యారేజ్ కి తీసుకెళ్తే.. వారు ఏం చేస్తారో మీకు తెలీదు.. కానీ బాగా డబ్బులు మాత్రం గుంజుతారు. కేవలం మీరు చూపించిన సమస్య మాత్రమే కాక ఇతర వేరే ఏదో సమస్యలు చెబుతూ మెకానిక్ లు మీ చేతి చమురు వదిలిస్తారు. ఇది చాలా మందికి అనుభవమే. అయితే మీకు మీరుగా కారు పడిన నొక్కులను మీరు ఇంటి దగ్గర నుంచే తొలగించవచ్చు. అది కూడా పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడే చిట్కానే వేడి నీటి చిట్కా. బాగా మరిగించిన నీటిని కారుకు పడిన నొక్కు పై పోస్తే చాలా సులభంగా ఆ నొక్కు కవర్ అయిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే..

  • మీ కారుకు ఏర్పడిన డెంట్ రిపేర్ చేయడం చాలా సులభం! మీకు కావలసిందల్లా వేడి నీటితో కూడిన కేటిల్, టాయిలెట్ ప్లంగర్.
  • ముందుగా మీరు నీటిని తీసుకొని కెటిల్లో వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని మీ కారుకు ఏర్పడిన డెంట్ చుట్టు పక్కల ప్రాంతాలపై పోయ్యాలి. అయితే నీరు బాగా మరిగి ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి.
  • ఇప్పుడు టాయిలెట్ ప్లంగర్‌ని తీసుకొని డెంట్ చుట్టూ ప్లంగర్ ఉంచి.. జాగ్రత్తగా మీ వైపునకు లాగండి. నెమ్మదిగా, జాగ్రత్తగా ఈ దశను రెండుసార్లు పునరావృతం చేయండి.
  • కొన్ని నిమిషాల జాగ్రత్తగా పని చేస్తే, డెంట్ పూర్తిగా పోతుంది! రూపాయి ఖర్చు లేకుండా మీ సమస్య పరిష్కారం అయ్యింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..