PAN Card: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా.? ఇకపై మీ పాన్ కార్డ్‌లు పనిచేయవు. మరోసారి అలర్ట్ చేసిన ఐటీ శాఖ.
పాన్-ఆధార్‌కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను ఇప్పటికే పలుసార్లు అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా పాన్, ఆధార్ లింక్ పై కేంద్రం పలుసార్లు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకసారి..
పాన్-ఆధార్‌కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను ఇప్పటికే పలుసార్లు అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా పాన్, ఆధార్ లింక్ పై కేంద్రం పలుసార్లు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకసారి రూ. 500, మరోసారి రూ. 1000తో ఆధార్-పాన్ అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అయితే ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ కార్డు ఉన్న వారందరూ 31-04-2023లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ గడువు మార్చితో ముగియనుండగా కేంద్రం మరో నెల పొడగిస్తూ ఏప్రిల్ వరకు గడువు పెంచింది.
ఒకవేళ పాన్-ఆధార్ లింక్ చేయకపోతే 1-04-2024 నుంచి లింక్ చేయని పాన్‌కార్డులు పని చేయవని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మరోసారి తెలిపింది. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లనివిగా మారుతాయని ఆదాయపు శాఖ శనివారం ప్రకటన చేసింది. మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అస్సాం, జమ్మూ కశ్మీర్‌తో పాటు మేఘాలయ రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు పాన్-ఆధార్ కార్డ్ అనుసంధానం నుంచి మినహాయింపునిచ్చారు.
పాన్ పనిచేయకపోతే నష్టాలేంటి.?
పాన్‌కార్డ్ పనిచేయకపోతే ఐటీ రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశం కోల్పోతారు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు జారీ చేయలేరు. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో లావాదేవీలు ఆగిపోతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..