FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీల జాతర.. తాజాగా నమ్మలేని వడ్డీ రేట్లు ప్రకటించిన మరో బ్యాంక్
గత నాలుగు త్రైమాసికాల నుంచి రెపో రేటు యథాతథంగా ఉంచడతో ఎఫ్‌డీల వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. అయితే కొత్త ఏడాది మాత్రం ఆర్‌బీఐ ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది .
కష్టపడి సంపాదించిన సొమ్మకు మంచి రాబడి పొందేందుకు ఎఫ్‌డీ మంచి వనరుగా ఉంటాయి. పెట్టుబడి భరోసాతో పాటు మంచి వడ్డీ రేట్లు ఎఫ్‌డీలు అందిస్తున్నాయి. అయితే 2022 నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కారణంగా ఎఫ్‌డీలకు అందించే వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగాయి. అయితే గత నాలుగు త్రైమాసికాల నుంచి రెపో రేటు యథాతథంగా ఉంచడతో ఎఫ్‌డీల వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. అయితే కొత్త ఏడాది మాత్రం ఆర్‌బీఐ ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది . నిర్దిష్ట పదవీకాలాలపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లను వరకు పెంచింది. కొత్త రేట్లు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే పీఎన్‌బీ కొన్ని బకెట్లపై ఎఫ్‌డీ రేట్లను తగ్గించింది. ఈ తాజాగా తగ్గింపుల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పీఎన్‌బీ వడ్డీ రేట్ల పెంపు ఇలా
పీఎన్‌బీ బ్యాంక్ 180 నుంచి 270 రోజుల కాలవ్యవధిపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ టర్మ్ డిపాజిట్లు ఇప్పుడు సాధారణ పౌరులకు 6 శాతం వరకూ ఉంటాయి. పీఎన్‌బీ ఎఫ్‌డీ రేట్లను 271 రోజులలో 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి 45 బీపీఎస్ పెంచింది. ఈ ఎఫ్‌డీలు ఇప్పుడు సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీను అందిస్తున్నాయి. అలాగే 400 రోజుల మెచ్యూరిటీతో పీఎన్‌బీ రేట్లను 6.80 శాతం నుంచి 7.25 శాతానికి 45 బీపీఎస్ పెంచింది. తాజా నిర్ణయం తర్వాత పీఎన్‌బీ 7 రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు అందిస్తుంది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 444 రోజుల ఎఫ్‌డీ రేట్లను 45 బీపీఎస్ తగ్గించి 7.25 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది.
సీనియర్ సిటిజన్లకు తాజా ఎఫ్‌డీ రేట్లు
తాజా సవరణ తర్వాత పీఎన్‌బీ ఏడు రోజుల నుండి పదేళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సూపర్ సీనియర్లకు 4.3 శాతం నుంచి 8.05 శాతం వరకు అందిస్తుంది.
ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ వడ్డీ రేటు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వర్తిస్తుంది . కొత్త రేటు ఈరోజు 27 డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుంది. తాజా పెంపు తర్వాత ఎస్‌బీఐ ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 3.5 నుండి 7 శాతం వరకు రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు అదనంగా పొందుతారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీ రేట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకు వివిధ మెచ్యూరిటీ బకెట్లపై పెంచింది. ఈ రేట్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఈరోజు డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వస్తాయి. తాజా పెంపు తర్వాత బీఓబీ సాధారణ కస్టమర్లకు 4.25 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ పరిధిని అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూరయ్యే డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..