FD Interest Rates: ఖాతాదారులకు‍ ఆ ఐదు ​బ్యాంకుల శుభవార్త.. ఎఫ్‌డీలపై ఏకంగా సూపర్‌ వడ్డీ ఆఫర్‌

భారతదేశంలో సొమ్మును పొదుపు చేయడానికి ఎఫ్‌డీలను మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల అధిక వడ్డీ రేటును అందిస్తాయో? బేరీజు వేసుకుని పెట్టుబడిదారుల ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. 2022 నుంచి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకుల మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి జాతీయ బ్యాంకుల ఇచ్చే వాటి కంటే అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.

FD Interest Rates: ఖాతాదారులకు‍ ఆ ఐదు ​బ్యాంకుల శుభవార్త.. ఎఫ్‌డీలపై ఏకంగా సూపర్‌ వడ్డీ ఆఫర్‌
Fixed Deposit
Follow us
Srinu

| Edited By: TV9 Telugu

Updated on: Dec 27, 2023 | 4:39 PM

కష్టపడి సంపాదించిన సొమ్ముకు మంచి రాబడి కావాలని ప్రతి ఒక్కరి ఆశ. ముఖ్యంగా భవిష్యత్‌ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని డబ్బు పొదుపు చేసే వారు చాలా మంది ఉంటారు. అయితే భారతదేశంలో ఇలా సొమ్మును పొదుపు చేయడానికి ఎఫ్‌డీలను మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల అధిక వడ్డీ రేటును అందిస్తాయో? బేరీజు వేసుకుని పెట్టుబడిదారుల ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. 2022 నుంచి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకుల మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి జాతీయ బ్యాంకుల ఇచ్చే వాటి కంటే అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. వీటిల్లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేటును అందించే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం.

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక సంవత్సరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌  కోసం పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.15 శాతం వడ్డీని అందిస్తుంది . ప్రత్యేక కేటగిరీ కింద ఇది 400 రోజుల టర్మ్ డిపాజిట్ కోసం 7.6 శాతం అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 400 రోజుల డిపాజిట్‌పై సంవత్సరానికి 8.10 శాతం వడ్డీని అందిస్తుంది. 

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

ఈ బ్యాంక్ తన ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.20 శాతం అందిస్తుంది. ప్రత్యేక వ్యవధి డిపాజిట్ల కోసం, వడ్డీ రేటు మరింత పెరుగుతుంది. 444 రోజుల డిపాజిట్‌పై సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ లభిస్తుంది. 888 రోజుల డిపాజిట్ 8.25 శాతం వడ్డీని ఇస్తుంది. ఐదు సంవత్సరాల పాటు ఎక్కువ కాలం ఉండే ఎఫ్‌డీలకు మాత్రం తక్కువ వడ్డీ రేటును ఇస్తుంది. అంటే ఈ వడ్డీ కేవలం సంవత్సరానికి 7.25 శాతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష్ స్మాల్ బ్యాంక్ 

ఇది ఒక సంవత్సరం డిపాజిట్లపై సంవత్సరానికి 8 శాతం వడ్డీని అందిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల మధ్య ఉండే పదవీకాలపు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 8.5 శాతం అందిస్తారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు 2-3 సంవత్సరాల కాలవ్యవధి డిపాజిట్లపై సంవత్సరానికి 9.10 శాతం వడ్డీకి అర్హులు. వారు 3-4 సంవత్సరాల మధ్య డిపాజిట్లపై సంవత్సరానికి 8.85 శాతం వడ్డీని కూడా అందుకుంటారు.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

ఈ బ్యాంక్‌ ఒక సంవత్సరం డిపాజిట్లపై 8 శాతం అందిస్తుంది. 2-3 సంవత్సరాల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 8.5 శాతం అందిస్తారు. సీనియర్ సిటిజన్లు 2-3 సంవత్సరాల కాలవ్యవధితో దాని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీని పొందేందుకు అర్హులు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

ఈ బ్యాంక్‌ 12 నెలల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని అందిస్తుంది. 560 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు 8.25 శాతం కూడా ఇస్తున్నారు. అయితే సీనియర్‌ సిటిజన్లు వడ్డీ రేట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీకి అర్హులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!