FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఏకంగా 9.15శాతం వడ్డీ.. వివరాలు ఇవి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనే వారికి శుభవార్త. పలు ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకుల్లో ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ బ్యాంకుల్లో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. సీనియర్ సిటిజెన్స్ కు గరిష్టంగా 9.15శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఏకంగా 9.15శాతం వడ్డీ.. వివరాలు ఇవి..
Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: Oct 29, 2023 | 3:50 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనే వారికి శుభవార్త. పలు ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకుల్లో ఎఫ్‌డీ లపై వడ్డీ రేట్లను సవరించాయి. వాటిల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ బ్యాంకుల్లో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. సీనియర్ సిటిజెన్స్ కు గరిష్టంగా 9.15శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు, వడ్డీ కేటర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 26న విడుదల చేసిన నోటిఫికేషన్లో నాన్ కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్డీలు)పై కనీస పరిమితిని రూ. 1 కోటికి సెట్ చేసింది. దీంతో రూ. 1 కోటి వరకు ఉన్న అన్ని కొత్త ఎఫ్డీలు ఇప్పుడు కాలబుల్ పరిధిలోకి వస్తుంది. కాల్ చేయదగిన ఎఫ్‌డీలు అంటే బ్యాంకులు ముందస్తు ఉపసంహరణను అనుమతిస్తాయి. ఈ క్రమంలో రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు, కోటక్ మహీంద్రా బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ఆ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

కోటక్ మహీంద్రా బ్యాంక్..

కోటక్ మహీంద్రా బ్యాంక్ వరుసగా 91 నుంచి 120 రోజులు, 23 నెలల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి కోసం సీనియర్ సిటిజన్‌లకు (60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) కనిష్టంగా 3.35 శాతం, గరిష్టంగా 7.75 శాతం అందిస్తుంది. వడ్డీ రేటు 179 రోజులు దాటిన అన్ని కాలాలకు 6.0 శాతం, 180 రోజులకు 7.50 శాతం, 181 రోజులు, 363 రోజులకు 6.50 శాతం, 364 రోజులకు 7.0 శాతం వడ్డీ రేటు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

అలాగే 365 రోజుల నుంచి 389 రోజుల వరకు, బ్యాంక్ 7.60 శాతం వడ్డీ రేటు అందిస్తుంది; 390 రోజులకు, 7.65 శాతం, 391 రోజుల నుంచి 23 నెలల వరకు వడ్డీ రేటు 7.70 శాతం వస్తుంది. 23 నెలల ఒక రోజు నుంచి రెండు సంవత్సరాల లోపు వరకూ 7.75 శాతం. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకూ వడ్డీ 7.60 శాతం. మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు 7.0 శాతం. నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు 6.75 శాతం, ఐదు సంవత్సరాల నుంచి పదేళ్ల వరకు 6.70 శాతం వడ్డీ ఉంటుంది. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 25 నుంచి అమలులోకి వస్తాయి.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

అక్టోబర్ 28న ఈ బ్యాంకు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్లకు 9.15 శాతం వడ్డీని అందిస్తోంది. శివాలిక్ బ్యాంక్ 19 నెలల ఒక రోజు నుంచి 20 నెలల వరకు ఈ వడ్డీని చేస్తోంది. ఇది బ్యాంకు అందిస్తున్న అత్యధిక వడ్డీ. అదే కాలవ్యవధికి సాధారణ పౌరులకు వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.

సీనియర్ సిటిజన్ల కు కనిష్టంగా ఏడు రోజుల నుంచి 14 రోజులకు వడ్డీ 4.25 శాతం ఉంటుంది. ఆరు నెలలకు పైన  అన్ని వ్యవధులకు వడ్డీ రేటు కనీసం 7.0 శాతంగా ఉంటుంది.

ఆరు నెలల నుంచి 12 నెలల లోపు వరకు, ఇది 7.0 శాతం; 12 నెలల నుంచి 19 నెలల వరకు, 8.60 శాతం; 19 నెలల ఒక రోజు నుంచి 20 నెలల వరకు, రేటు అత్యధికంగా 9.15 శాతంగా ఉంది. అలాగే 20 నెలల నుంచి 36 నెలల మధ్య కాలానికి 8.50 శాతం, 36 నెలల ఒక రోజు నుంచి 60 నెలల కాలానికి 7.50 శాతం, 60 నెలల ఒక రోజు నుంచి 120 నెలల వరకు 7.25 శాతం వడ్డీ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..