Penny Drop Verification: ఆ పింఛన్‌ పథకాల ఖాతాదారులకు అలెర్ట్‌.. విత్‌డ్రా సమయంలో ఆ ధ్రువీకరణ తప్పనిసరి

అనుకోని అవసరాలు వచ్చినప్పుడు ఆ పింఛన్‌ సొమ్ములో నుంచి కొంత మేర తీసుకునే వెసులబాటు ఉంది. ఎన్‌పీఎస్‌, అటల్‌ పెన్షన్‌ యోజన నిష్క్రమణ, ఉపసంహరణ నియమాలను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సవరించింది. వినియోగదారులు నిష్క్రమణ, ఉపసంహరణ కోసం కచ్చితంగా పెన్నీ డ్రాప్‌ ధ్రువీకరణ చేయాలని పేర్కొంది. ఈ తాజా చర్యలు ఎన్‌పీఎస్‌ లేదా ఏపీవై  చందాదారుల కోసం తక్షణ బ్యాంక్‌ ధ్రువీకరణ నిష్క్రమణ  లేదా ఉపసంహరణ అభ్యర్థన సమయంలో పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

Penny Drop Verification: ఆ పింఛన్‌ పథకాల ఖాతాదారులకు అలెర్ట్‌.. విత్‌డ్రా సమయంలో ఆ ధ్రువీకరణ తప్పనిసరి
Banks festive season special offers
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2023 | 7:15 AM

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. జనాభా చాలా ఎక్కువ శాతం వారే ఉంటారు. వేతనజీవులు రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా గౌరవప్రదమైన జీవినం గడపడానికి వివిధ పింఛన్‌ ప్లాన్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్‌పీఎస్‌ ద్వారా ఉద్యోగులకు పింఛన్‌ భరోసానిస్తుంది. ఎన్‌పీఎస్‌ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంది. వారు కూడా నెలవారీ చందాలు కట్టి పింఛన్‌ పథకాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అనుకోని అవసరాలు వచ్చినప్పుడు ఆ పింఛన్‌ సొమ్ములో నుంచి కొంత మేర తీసుకునే వెసులబాటు ఉంది. ఎన్‌పీఎస్‌, అటల్‌ పెన్షన్‌ యోజన నిష్క్రమణ, ఉపసంహరణ నియమాలను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సవరించింది. వినియోగదారులు నిష్క్రమణ, ఉపసంహరణ కోసం కచ్చితంగా పెన్నీ డ్రాప్‌ ధ్రువీకరణ చేయాలని పేర్కొంది. ఈ తాజా చర్యలు ఎన్‌పీఎస్‌ లేదా ఏపీవై  చందాదారుల కోసం తక్షణ బ్యాంక్‌ ధ్రువీకరణ నిష్క్రమణ  లేదా ఉపసంహరణ అభ్యర్థన సమయంలో పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ తాజా సవరణల గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం.

ఎన్‌పీఎస్‌, ఏపీవై, ఎన్‌పీఎస్‌ లైట్‌కు అన్ని రకాల నిష్క్రమణలు, ఉపసంహరణల కోసం వినియోగదారుల బ్యాంకు ఖాతా సవరణ కోసం ఈ తాజా ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్ల కోసం కేంద్రీకృత రికార్డ్‌ కీపింగ్‌కు బాధ్యత వహించే సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు నిష్క్రమణ లేదా ఉపసంహరణ ధ్రువీకరణ లేకపోతే అభ్యర్థనలు ప్రాసెస్‌ చేయదు. అలాగే పెన్నీ డ్రాప్‌ ధ్రువీకరణ విఫలమైన పక్షంలో బ్యాంకు ఖాతా మార్పులను చేయడానికి కూడా అంగీకరించదు. ఈ మేరకు పీఎఫ్‌ఆర్‌డీఏ అక్టోబర్‌ 25న ఓ సర్క్యూలర్‌ కూడా జారీ చేసింది. పెన్నీ డ్రాప్‌ ధ్రువీకరణ విఫలమైతే బ్యాంక్‌ ఖాతా వివరాలను సవరించడానికి సంబంధిత నోడల్‌ ఆఫీస్‌/ మధ్యవర్తి ద్వారా సీఆర్‌ఏ తీసుకుంటుంది. ఈ మేరకు సీఆర్‌ఏ చందాదారులకు కమ్యూనికేట్‌ చేస్తుంది. ముఖ్యంగా పెన్నీ డ్రాప్‌ ధ్రువీకరణ విఫలమైతే ఈ-మెయిల్‌ ద్వారా చందాదారుడిని హెచ్చరిస్తుంది. అలాగే వీలైనంత త్వరగా నోడల్‌ ఆఫీసర్‌ లేదా పీఓపీను సంప్రదించాలని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి