Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Link Aadhaar-PAN: ఇక పది రోజులే సమయం.. ఈ లోపు పని పూర్తి చేయకపోతే.. ఆ ఖాతాలన్నీ ఫ్రీజ్‌.. పూర్తి వివరాలు..

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఎస్‌సీ), సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) వంటి పథకాల్లో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టారా? అయితే మీరు వెంటనే ఓ పనిచేయాలి. లేకుంటే మీ ఖాతాలు ఫ్రీజ్‌ అయిపోయే ప్రమాదం ఉంది. మీ ఆధార్‌కార్డుతో పాన్‌ కార్డును అనుసంధానం చేశారా? ఒకవేళ సెప్టెంబర్‌ 30లోపు చేయపోతే మీ స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌ ఖాతాలు నిలిచిపోతాయి.

Link Aadhaar-PAN: ఇక పది రోజులే సమయం.. ఈ లోపు పని పూర్తి చేయకపోతే.. ఆ ఖాతాలన్నీ ఫ్రీజ్‌.. పూర్తి వివరాలు..
Pan Aadhaar
Follow us
Madhu

|

Updated on: Sep 20, 2023 | 8:00 AM

మీరు ఏదైనా స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టారా? స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఎస్‌సీ), సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌) వంటి పథకాల్లో భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టారా? అయితే మీరు వెంటనే ఓ పనిచేయాలి. లేకుంటే మీ ఖాతాలు ఫ్రీజ్‌ అయిపోయే ప్రమాదం ఉంది. మీ ఆధార్‌కార్డుతో పాన్‌ కార్డును అనుసంధానం చేశారా? ఒకవేళ సెప్టెంబర్‌ 30లోపు చేయపోతే మీ స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌ ఖాతాలు నిలిచిపోతాయి. కేవలం పది రోజుల్లోనే డెడ్‌లైన్‌ ముగుస్తోంది కాబట్టి ఖాతాదారులు అప్రమత్తం అవ్వాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

ఇదీ విషయం..

మార్చి 31, 2023 నాటి నోటిఫికేషన్‌లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ వంటి అనేక ఇతర చిన్న పొదుపు పథకాలకు ఆధార్, పాన్ రెండింటినీ తప్పనిసరి చేసింది. కొత్తగా ప్రారంభించే ఖాతాదారులే కాకుండా.. ఇప్పటికే ఖాతాలున్న వారు కూడా తమ ఆధార్ నంబర్లు పాన్‌ లింక్‌ చేసి ఇవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

నోటిఫికేషన్ ప్రకారం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వారు పోస్ట్‌ ఆఫీసులు లేదా తమ బ్యాంకుల్లో తమ ఆధార్ నంబర్‌, పాన్‌ సమర్పించినట్లు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఇది సెప్టెంబర్ 30, 2023లోపు చేయాలి. ఆ తర్వాత చేయడం కుదరదు.

ఇవి కూడా చదవండి

ఖాతాలు ఎందుకు ఫ్రీజ్‌ అవుతాయి..

గడువులోపు పెట్టుబడిదారులు తమ ఆధార్, పాన్‌లను పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ లేదా ఎస్సీఎస్‌ఎస్‌తో లింక్ చేయడంలో విఫలమైతే, ఈ చిన్న పొదుపు పథకాలలో వారి పెట్టుబడులు స్తంభించిపోతాయి. అంతేకాకుండా, ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడిపై వడ్డీ ప్రయోజనాలను కూడా పొందలేరు.ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ చట్టంలోని ఏదైనా స్కీమ్‌ల క్రింద ఖాతా తెరవడానికి పెట్టుబడిదారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్, పాన్‌ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయని పక్షంలో ఖాతాలు నిలిచిపోతాయి.

ఆధార్‌ను ఎందుకు లింక్ చేయాలి?

మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. పెట్టుబడి పెట్టే సొమ్ముకు పూర్తి భ్రదతతో పాటు భరోసాను అందించేందుకు ఈ స్మాల్‌సేవింగ్‌ స్కీమ్‌ ఖాతా దారులు కూడా తమన పాన్‌, ఆధార్‌లను లింక్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే ఖాతా ఉంటే వెంటనే ఆధార్‌ను సమర్పించాలని వివరించింది. ఒక డిపాజిటర్ ఇప్పటికే ఖాతా తెరిచి, తన ఆధార్ నంబర్‌ను ఖాతాల కార్యాలయానికి సమర్పించనట్లయితే, అతను 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఆరు నెలల వ్యవధిలో వాటిని సమర్పించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

లింక్‌ చేయకపోతే ఏమవుతుంది..

ఖాతాదారులు ఆధార్‌ పాన్‌ లింక్‌ చేయకుండా ఉండిపోతే, అతనికి సంబంధించిన చిన్న మొత్తాల పెట్టుబడి పథకాలు అన్ని స్తంభించిపోతాయి. బకాయి వడ్డీ కూడా పెట్టుబడిదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమకాదు. పీపీఎఫ్‌, సుకన్యా సమృద్ధి యోజన వంటి పరిమితులకు ఎదుర్కొనవచ్చు. మెచ్యూరిటీ మొత్తం పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..