AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI YONO: యోనో యాప్‌ ద్వారానే డిజిటల్‌ అకౌంట్లు.. సులువుగా, వేగంగా పనైపోతుంది.. వారికి మంచి అవకాశం..

ఇప్పుడు నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)లకు ఓ శుభవార్త చెప్పింది. వారు ఎస్‌బీఐలో ఖాతా ప్రారంభించాలంటే బ్రాంచ్‌ కు రావాల్సిన అవసరం లేకుండా ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారానే సులభంగా ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ ఖాతాలను(సేవింగ్స్‌, కరెంట్‌ ఖతాలు) ప్రారంభించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

SBI YONO: యోనో యాప్‌ ద్వారానే డిజిటల్‌ అకౌంట్లు.. సులువుగా, వేగంగా పనైపోతుంది.. వారికి మంచి అవకాశం..
Sbi Yono
Madhu
|

Updated on: Sep 20, 2023 | 8:30 AM

Share

దేశంలోని అతి పెద్ద రుణదాతల్లో ఒకటైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫోన్‌ ద్వారా వాట్సాప్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌, యోనో లైట్‌ యాప్‌ వంటి వాటి ద్వారా వినియోగదారులకు విస్తృత సేవలను అరచేతిలోకి తెచ్చిన పెట్టిన బ్యాంకు.. ఇప్పుడు నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)లకు ఓ శుభవార్త చెప్పింది. వారు ఎస్‌బీఐలో ఖాతా ప్రారంభించాలంటే బ్రాంచ్‌ కు రావాల్సిన అవసరం లేకుండా ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారానే సులభంగా ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ ఖాతాలను(సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాలు) ప్రారంభించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్‌ఆర్‌ఐ వినియోగదారుల సౌకర్యార్థం..

ఎన్‌ఆర్‌ఐ వినియోగదారులు చాలా కాలం నుంచి అభ్యర్థిస్తున్న ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు ఎస్‌బీఐ వారికి అందించింది. ఎన్‌ఆర్‌ఐలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మన దేశంలో ఖాతాలను ప్రారంభించవచ్చు. అందుకే ఎన్‌టీబీ ఆప్షన్‌ ను తీసుకొచ్చింది. ఎన్‌టీబీ అంటే న్యూ టు బ్యాంక్‌ అనే పీచర్‌ ద్వారా కొత్త వినియోదారులకు ఖాతా ప్రారంభించేందుకు వెసులుబాటు కల్పించింది.

ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ అంటే..

నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌(ఎన్‌ఆర్‌ఈ)అకౌంట్‌ అంటే ఎన్‌ఆర్‌ఐ పేరు మీద ఇండియాలో ఓపెన్‌ అయ్యే అకౌంట్‌. ఇందులో విదేశాల్లో సంపాదనను సేవ్‌ చేసుకోవచ్చు. అలాగే నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ(ఎన్‌ఆర్‌ఓ)అకౌంట్‌ అంటే ఇది ఎన్‌ఆర్‌ఐ పేరు మీద ఇండియాలో ఓపెన్‌ అయ్యే ఖాతా. ఇది ఇక్కడ సంపాదనను దాచుకునేందుకు ఉపయోగపడుతుంది. అంటే ఇంటి అద్దెల ద్వారా, డెవిడెండ్ల ద్వారా, పెన్షన్లు, వడ్డీల వంటివి దీనిలో వేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సింగిల్‌ స్టాప్‌ సొల్యూషన్‌..

ఎన్‌ఆర్‌ఐలకు సులభంగా, వేగంగా ఈ ఖాతాలు ప్రారంభించేందుకు వీలుగా ఈ డిజిటల్‌ ఖాతాలను తీసుకొచ్చింది. వీటి ద్వారా ఎన్‌ఆర్‌ఐలకు చాలా సౌలభ్యం ఉంటుంది. అలాగే వినియోగదారులు దీని ద్వారా దరఖాస్తుల స్థితిని కూడా తెలుసుకొనే వీలుంటుంది. ఇది ఎన్‌ఆర్‌ఐల అన్ని అవసరాలకు సింగిల్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా ఉపయోగపడుతుంది.

యోనో యాప్ తో విస్తృత సేవలు..

ఎస్బీఐ యోనో యాప్ తో విస్తృత సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల లావాదేవీలతో పాటు షాపింగ్ చేసే వెసులుబాటును కూడా బ్యాంకు వినియోగదారులకు అందించింది. బెనిఫీషియరీ యాడ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా సులువుగా నగదు బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. ఐఎంపీఎస్, నెఫ్ట్ వంటి వివిధ రకాల మోడ్లలో నగదును అవతలి వ్యక్తులకు పంపించుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐలకు కూడా ప్రత్యేక సౌకర్యాలను తీసుకురావడంతో వారి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..