Savings Account: పొదుపు ఖాతాల్లో ఏడు శాతం వరకూ వడ్డీ.. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది చదవండి..
ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిన్‌కేర్ తన బ్యాంకులో సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేటును 25బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే ప్రస్తుతం ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 7.5శాతంగా ఉంది. అయితే ఇది రూ. 5లక్షల కంటే ఎక్కువ రూ. 10కోట్ల తక్కువ ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఇదే క్రమంలో ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా తమ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు సవరించాయి.

సేవింగ్స్ అకౌంట్లలో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చితే సగం కూడా కొన్ని బ్యాంకుల్లో ఉండదు. మూడు శాతం నుంచి నాలుగు శాతం వరకూ మాత్రమే ప్రముఖ బ్యాంకులు ఇస్తుంటాయి. అయితే ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిన్‌కేర్ తన బ్యాంకులో సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేటును 25బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే ప్రస్తుతం ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు 7.5శాతంగా ఉంది. అయితే ఇది రూ. 5లక్షల కంటే ఎక్కువ రూ. 10కోట్ల తక్కువ ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఇదే క్రమంలో ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా తమ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు సవరించాయి. ఫిన్ కేర్ బ్యాంకులో వడ్డీ రేట్లతో పాటు ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోని వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు..
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సవరించిన సేవింగ్ అకౌంట్ వడ్డీ రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
- రూ.1 లక్ష వరకు వడ్డీ రేటు 3.51%
- రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వర 5.11%
- రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 7.11%
- రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు 7.50%
- రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 7.50%
- రూ.50 నుంచి రూ.2 కోట్ల వరకు 7.50%
- రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు 7.50%
- రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు 6.50%
- రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు 5.00%
- రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు 4.00
- రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు 3.25%
- రూ.30 కోట్లకు పైగా 3.00%
ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు..
రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.1 లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు డిపాజిట్లపై 7.00%
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిపాజిట్లపై 7.50%
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లపై 7.50%
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 7.25%
రూ.10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు..
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లపై 7.50%
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు డిపాజిట్లపై 7.25%
- ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.25 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఉన్న డిపాజిట్లపై 7.00%
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ. 50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే బ్యాలెన్స్ మొత్తాలపై 7.25%
- సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ 7.50%
రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు..
- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ లో రూ. 50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు 7.25%
- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ రూ. 25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు 7.25%
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ లో రూ.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లపై 7.50%
- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్లో రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు 7.25%
ఇది గమనించండి.. అధిక వడ్డీ రేట్లు సాధారణంగా పెద్ద డిపాజిట్లతో అనుసంధానించబడతాయి. పొదుపు ఖాతాలలో గణనీయమైన మొత్తాలను ఉంచితే కస్టమర్లకు బ్యాంకులు రివార్డ్ చేస్తాయి. అంటే ఒకరు ఎంత ఎక్కువ పొదుపు చేస్తే, వారికి అంత ఎక్కువ రాబడిని వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..