AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం పెట్టుబడిలో వెనుకబడిన ఉత్తర భారతం.. మరి ఏ నగరం ముందుంది?: ఇండియాస్ పల్స్ సర్వే

బంగారం కొనుగోళ్ల తీరు చూస్తుంటే ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఇక్కడ వెస్ట్ ఇండియా ఆధిపత్యం కనిపించింది. 2022 సర్వేలో, 51 శాతం కుటుంబాలతో సూరత్ నెంబర్ 1 నగరంగా ఉంది. రెండవ, మూడవ నగరాలలో కృష్ణ, థానే పేర్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మూడు నగరాలు కొత్తవే. బెంగళూరు 2023లో 69 శాతం కుటుంబాలతో ముందంజలో ఉంది. దీని తర్వాత తిరువనంతపురం వస్తుంది. ఇక్కడ 66 శాతం కుటుంబాలు బంగారంలో పొదుపు చేస్తున్నాయి...

బంగారం పెట్టుబడిలో వెనుకబడిన ఉత్తర భారతం.. మరి ఏ నగరం ముందుంది?: ఇండియాస్ పల్స్ సర్వే
Gold Investment
Subhash Goud
|

Updated on: Dec 27, 2023 | 10:13 AM

Share

భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన లోహం బంగారం. అందంగా కనిపించడంతో పాటు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. భారతీయ కుటుంబాలు తమ పొదుపును బంగారంలో పెట్టుబడి పెడుతున్నాయి. గత ఏడాది కాలంగా ఇది బాగా పెరిగింది. 2022లో 15 శాతం కుటుంబాలు బంగారంలో పొదుపు చేయగా, 2023 నాటికి ఈ సంఖ్య 21 శాతానికి పెరిగిందని మనీ9 సర్వే వెల్లడించింది. బంగారంపై పొదుపు చేసేవారు పెరగడానికి ధరల పెరుగుదల ఒక కారణం. గత ఏడాది కాలంలో బంగారం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. సావరిన్ గోల్డ్ బాండ్ వంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేసింది. దీంతో బంగారం వైపు ఎక్కువమంది మొగ్గు చూపారు.

బంగారం పెట్టుబడుల్లో వెనకబడ్డ ఉత్తర భారతం

బంగారం కొనుగోళ్ల తీరు చూస్తుంటే ఉత్తర, దక్షిణ భారతాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఇక్కడ వెస్ట్ ఇండియా ఆధిపత్యం కనిపించింది. 2022 సర్వేలో, 51 శాతం కుటుంబాలతో సూరత్ నెంబర్ 1 నగరంగా ఉంది. రెండవ, మూడవ నగరాలలో కృష్ణ, థానే పేర్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది మూడు నగరాలు కొత్తవే. బెంగళూరు 2023లో 69 శాతం కుటుంబాలతో ముందంజలో ఉంది. దీని తర్వాత తిరువనంతపురం వస్తుంది. ఇక్కడ 66 శాతం కుటుంబాలు బంగారంలో పొదుపు చేస్తున్నాయి. ఈసారి అత్యంత షాక్ ఇచ్చే పేరు ఒకటి బయటకు వచ్చింది.. అదే డార్జిలింగ్. దీనిని బట్టి డార్జిలింగ్‌లో ప్రజల ఆదాయం ఎలా పెరిగిందో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

తూర్పు, దక్షిణ ఆధిపత్యం

బంగారంలో పెట్టుబడులు పెట్టే నగరాల గురించి చెప్పాలంటే, ఇక్కడ తూర్పు, దక్షిణ భారతదేశాల స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తుంది. 57 శాతం కుటుంబాలు బంగారంపై పెట్టుబడి పెట్టడంతో జల్‌పైగురి నాలుగో నగరంగా అవతరించింది. దీని తరువాత శివమొగ్గ, పశ్చిమ మేదినీపూర్ వస్తాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టే టాప్ 10 నగరాల్లో చేరింది. రాజ్‌కోట్, కోయంబత్తూర్, ఫరీదాబాద్ వంటి ఇతర నగరాలు టాప్ 10 రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఇండియాస్ పల్స్… అతిపెద్ద సర్వే

ప్రఖ్యాత గ్లోబల్ ఏజెన్సీ RTI ఇంటర్నేషనల్ ఈ సర్వే చేసింది. ప్రపంచ బ్యాంకు వంటి పెద్ద సంస్థల కోసం ఈ ఏజెన్సీ ఇలాంటి సర్వేలు నిర్వహిస్తోంది. భారతదేశంలో, మనీ 9 వంటి సర్వే సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ లేదా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తారు. ఈ రెండు సంస్థల ఇటీవలి సర్వే Money9 సర్వే కంటే చాలా పాతది. ప్రస్తుత పరిస్థితిపై మనీ 9 సర్వే భారతీయుల ఆర్థిక ఆరోగ్యం గురించి అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి