FD Interest Rates: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. ఆ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై 9.11 శాతం వడ్డీ

పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ గత రెండేళ్ల నుంచి రెపో రేటును పెంచుతుంది. ఆర్‌బీఐ చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు అదిరిపోయే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ పెరిగిన వడ్డీ గృహరుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిపై అధిక వడ్డీ బాదుడగత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్యాంకులు బ్రేక్‌ వేశాయి. అయితే కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

FD Interest Rates: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. ఆ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై 9.11 శాతం వడ్డీ
Money
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 9:15 AM

ధనం మూలం ఇదం జగత్‌ అంటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని ఉద్దేశం. ఈ రోజుల్లో డబ్బు ఉంటే బంధాలు, బంధుత్వాలు నిలుస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడు భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నెల జీతంపై ఆధారపడే ఉద్యోగస్తులు లేదా రిటైరన ఉద్యోగస్తులు కచ్చితంగా ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ప్రజల్లో పొదుపు అవగాహన పెంచడంతో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ గత రెండేళ్ల నుంచి రెపో రేటును పెంచుతుంది. ఆర్‌బీఐ చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు అదిరిపోయే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ పెరిగిన వడ్డీ గృహరుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిపై అధిక వడ్డీ బాదుడగత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచింది. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్యాంకులు బ్రేక్‌ వేశాయి. అయితే కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు కూడా ఇటీవల వడ్డీ రేటు పెంపును ప్రకటించింది. ఈ పెంపు ఎంత శాతం ఉందో?ఓ సారి తెలుసుకుందాం.

ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ అకాల ఉపసంహరణ సౌకర్యంతో రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ముఖ్యంగా ఫిన్‌కేర్‌ 101 పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 9.11 శాతం వడ్డీను అందిస్తుంది. అయితే ఈ పథకం కేవలం సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే సాధారణ పౌరులకు 8.11 శాతం వడ్డీ ఫిన్‌కేర్‌ బ్యాంకు అందిస్తుంది. అలాగే ఫిన్‌కేర్‌ 101 పథకంలో అత్యధిక వడ్డీను పొందడానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను 750 రోజులకు పెట్టుబడి పెట్టాలి. ఈ తాజా వడ్డీ రేట్లు సెప్టెంబర్‌ 21 నుంచి అందుబాటులోకి వచ్చాయి. 

శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు

అలాగే శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో పెట్టుబడులపై సీనియర్‌ సిటిజన్లకు 8.60 శాతం వడ్డీను అందిస్తుంది. అలాగే 12 నుంచి 18 నెలల డిపాజిట్లకు 8.10 శాతం వడ్డీను అందిస్తుంది. ఈ బ్యాంకులో సవరించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..