HRA Allowance: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఆ విషయం తెలుసుకోకపోతే ఇక అంతే..!
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (13ఏ) ప్రకారం నిర్దిష్ట నియమాలు, నిబంధనల ఆధారంగా మీ హెచ్‌ఆర్‌ఏలో కొంత భాగం పన్నుల నుంచి మినహాయిస్తారు. అంటే మీరు మీ హెచ్ఎస్ఏలో కొంత భాగాన్ని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణించకుండానే ఉంచుకోవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం), మీ పన్నులను దాఖలు చేయడానికి ముందు మీరు పొందగలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా కీలకం.
ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) అనేది జీతంలో ముఖ్యమైన భాగం. మీ ప్రాథమిక జీతంలా కాకుండా హెచ్‌ఆర్‌ఏపై పూర్తిగా పన్ను విధించరు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (13ఏ) ప్రకారం నిర్దిష్ట నియమాలు, నిబంధనల ఆధారంగా మీ హెచ్‌ఆర్‌ఏలో కొంత భాగం పన్నుల నుంచి మినహాయిస్తారు. అంటే మీరు మీ హెచ్ఎస్ఏలో కొంత భాగాన్ని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణించకుండానే ఉంచుకోవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం), మీ పన్నులను దాఖలు చేయడానికి ముందు మీరు పొందగలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా కీలకం. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం వలన మీరు పన్ను నిబంధనల ప్రకారం డబ్బును చట్టబద్ధంగా ఆదా చేసుకోవచ్చు.
ఇంటి అద్దె అలవెన్సులు ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?
- మీరు స్వయం ఉపాధి పొందితే లేదా ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) లేకుండా జీతం పొందుతున్నట్లయితే మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీజీని ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10-13ఏ కింద మీరు ఈ మార్గాల్లో ఇంటి అద్దె అలవెన్స్‌కు మినహాయింపులను పొందవచ్చు
- మీరు మెట్రోయేతర నగరాల్లో నివసిస్తుంటే మీ ప్రాథమిక జీతంలో 40 శాతం.
- మీరు చెన్నై, కోల్‌కత్తా, న్యూఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే మీ ప్రాథమిక జీతంలో 50 శాతం.
- మీరు చెల్లించే అద్దె మీ హెచ్‌ఆర్‌ఏ కంటే ఎక్కువగా ఉంటే మీ ప్రాథమిక జీతంలో 10 శాతం తీసివేసిన తర్వాత మీరు చెల్లించిన అసలు అద్దె మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
- క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలు
- నెలకు రూ. 3,000 వరకు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ల కోసం ఒక సాధారణ ప్రకటన సరిపోతుంది. అదనపు రుజువు అవసరం లేదు.
- మీ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ నెలకు రూ.3,000 నుంచి రూ. 8,333 మధ్య ఉంటే మీరు తప్పనిసరిగా మీ యజమాని సంతకంతో అద్దె స్లిప్లను అందించాలి.
- నెలకు రూ. 8,333 కంటే ఎక్కువ అద్దె మొత్తాల కోసం, మీరు సమర్పించాలి
అద్దె రసీదులు
- ఇంటి అద్దెకు సంబంధించిన పాన్ నంబర్
- ఇంటి యజమానికి పాన్ నంబర్ లేకుంటే పాన్ లేకపోవడాన్ని వివరిస్తూ సాదా కాగితంపై వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిక్లరేషన్లో యజమాని చిరునామా, ఫోన్ నంబర్ ఉండాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..