SBI Sarvottam FD: ఎస్‌బీఐ సర్వోత్తమ్‌.. అన్ని ఎఫ్‌డీల్లో కెల్లా ఇదే ఉత్తమం.. ప్రయోజనాలు చూస్తే నమ్మలేరు..

బ్యాంకులు సాధారణంగా నాన్-కాలబుల్‌ ఎఫ్‌డీపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి, ఎందుకంటే దీనిలో మీ డబ్బు నిర్దిష్ట కాలానికి లాక్-ఇన్ చేయబడి ఉంటుంది. అటువంటి పథకాల కింద ముందస్తు ఉపసంహకరణలు అనుమతించరు. ఇటువంటి నాన్‌ కాలబుల్‌ ఎఫ్‌డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకొచ్చింది. అధిక వడ్డీ రేట్లతో ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ పేరిట నాన్-కాలబుల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ప్రారంభించింది.

SBI Sarvottam FD: ఎస్‌బీఐ సర్వోత్తమ్‌.. అన్ని ఎఫ్‌డీల్లో కెల్లా ఇదే ఉత్తమం.. ప్రయోజనాలు చూస్తే నమ్మలేరు..
Fixed Deposit
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2023 | 12:20 PM

ఫిక్స్‌డ్‌ డిపాజిట్(ఎఫ్‌డీ) సురక్షిత పెట్టుబడి పథకాలలో ఒకటి. పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్‌ చేసి, అధిక వడ్డీతో పాటు బహుళ ప్రయోజనాలు అందించే ఈ స్కీమ్‌లో చాలా మంది పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజెన్స్‌ అధికంగా దీనిలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అయితే ఈ స్కీమ్ ను బ్యాంకులో గానీ, పోస్ట్‌ ఆఫీసులో గానీ తీసుకునే వీలుంది. అయితే ఒక్కో చోట ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. బ్యాంకుల్లోనూ ఆ బ్యాంకు పాలసీని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నాన్-కాలబుల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.1 కోటికి పెంచింది. బ్యాంకులు సాధారణంగా నాన్-కాలబుల్‌ ఎఫ్‌డీపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి, ఎందుకంటే దీనిలో మీ డబ్బు నిర్దిష్ట కాలానికి లాక్-ఇన్ చేయబడి ఉంటుంది. అటువంటి పథకాల కింద ముందస్తు ఉపసంహకరణలు అనుమతించరు. ఇటువంటి నాన్‌ కాలబుల్‌ ఎఫ్‌డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకొచ్చింది. అధిక వడ్డీ రేట్లతో ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ పేరిట నాన్-కాలబుల్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ ఎఫ్‌డీ..

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనీస మొత్తం రూ. 1 కోటి ఉంది. గతంలో ఇది ఈ కనీస పెట్టుబడి మొత్తం రూ.15 లక్షలుగా ఉండేది. దీనిని మారుస్తూ ఎస్‌బీఐ అక్టోబర్ 26, 2023న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముందస్తు ఉపసంహరణ ఆప్షన్‌ లేకుండా దేశీయ టర్మ్ డిపాజిట్‌లను (టీడీలు) అందించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది. పదిహేను లక్షలు, అంతకంటే తక్కువ మొత్తంలో వ్యక్తుల నుండి స్వీకరించబడిన అన్ని టీడీలు ముందస్తు విత్‌డ్రా-సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు..

రెండు సంవత్సరాల కాలవ్యవధితో ఎస్‌బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఏడాది కాలవ్యవధికి వడ్డీ రేటు 7.10 శాతంగా నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. సీనియర్ సిటిజన్లు రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.9 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఏడాది పాటు వారికి 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ ఎఫ్‌డీలో ఏడాది టెన్యూర్‌పై సీనియర్‌ సిటిజెన్స్‌ 7.60శాతం వడ్డీ అందుకుంటారు. అదే విధంగా రెండేళ్ల డిపాజిట్లపై 7.90శాతం వడ్డీని పొందుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎవరు అర్హులంటే..

ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టేందుకు రెసిడెంట్‌ ఇండివిడ్యూవల్స్‌, నాన్‌-ఇండివిడ్యూవల్‌ కస్టమర్లు అర్హులు. మైనర్లు, ఎన్‌ఆర్‌ఐలకు అవకాశం లేదు. నేరుగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లకు వెళ్లి ఈ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాక ఎస్‌బీఐ వినియోగదారులకు మరో ఎఫ్‌డీ పథకం అందుబాటులో ఉంది. దాని పేరు ఎస్‌బీఐ అమృత్‌ కలష్‌. ఇది 400 రోజుల ఎఫ్‌డీ. దీనిలో 7.60శాతం వడ్డీ వస్తుంది. ఇది కాక ఎస్‌బీఐ వీ కేర్‌ స్కీమ్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిలో సీనియర్‌ సిటిజెన్స్‌కు 7.50శాతం వడ్డీ వస్తుంది. అయితే ఈ రెండు స్కీమ్ల కంటే ఎస్‌బీఐ సర్వోత్తమ్‌ ఎఫ్‌డీలోనే అధిక వడ్డీ 7.90శాతం వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
హై కొలెస్ట్రాల్‌కు ఛూమంత్రం.. కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన