AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Policies: డయాబెటిక్ పేషెంట్ల కోసం ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయా?

డయాబెటిస్ కోసం కవర్ చాలా ఖరీదైనది కావడానికి ఒక కారణం ఏమిటంటే, ఎక్కువ క్లెయిమ్స్ వచ్చే అవకాశం ఉండడమే అని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అశోక్ స్వతంత్ర అంటున్నారు. చాలా కంపెనీలు మధుమేహం నుంచి వచ్చే అనారోగ్యాలను కవర్ చేయవు. ఇన్సూరెన్స్ కంపెనీలకు సమగ్రమైన డయాబెటిక్ కవర్ ఆర్థికంగా సాధ్యం కాదు. అటువంటప్పుడు, డయాబెటిస్ కోసం వస్తున్న స్పెసిఫిక్ పాలసీ మీకు కొంత వరకు సహాయపడగలిగినప్పటికీ, మీ ఆర్థిక అవసరాలన్నింటినీ కవర్..

Insurance Policies: డయాబెటిక్ పేషెంట్ల కోసం ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయా?
Insurance Policies
Subhash Goud
|

Updated on: Aug 17, 2023 | 9:07 PM

Share

62 ఏళ్ల నరసింహం గత 6 సంవత్సరాలుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఆయన పంచదార లేకుండా టీ తాగడం అలవాటు చేసుకున్నప్పటికీ, డయాబెటిస్ కోసం వాడాల్సిన మేదిసిన్స్ ఆయన బడ్జెట్ తల్లకిందులు చేసేస్తున్నాయి. ఆయన ఇన్సులిన్, మేడిసిన్స్, డాక్టర్ ఫీజు అలాగే ఇతర వైద్య ఖర్చుల కోసం నెల నెలా దాదాపు రూ. 5,000-6,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకున్నారు. కానీ దాని వలన తన జేబు మరింత ఖాళీ అయిపోతుందని భయపడ్డారు. . రూ. 2 లక్షల మొత్తం ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం సంవత్సరం ప్రీమియం 30 వేల నుంచి 95 వేల రూపాయల వరకూ ఉంటుంది.

డయాబెటిస్ కోసం కవర్ చాలా ఖరీదైనది కావడానికి ఒక కారణం ఏమిటంటే, ఎక్కువ క్లెయిమ్స్ వచ్చే అవకాశం ఉండడమే అని ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అశోక్ స్వతంత్ర అంటున్నారు. చాలా కంపెనీలు మధుమేహం నుంచి వచ్చే అనారోగ్యాలను కవర్ చేయవు. ఇన్సూరెన్స్ కంపెనీలకు సమగ్రమైన డయాబెటిక్ కవర్ ఆర్థికంగా సాధ్యం కాదు. అటువంటప్పుడు, డయాబెటిస్ కోసం వస్తున్న స్పెసిఫిక్ పాలసీ మీకు కొంత వరకు సహాయపడగలిగినప్పటికీ, మీ ఆర్థిక అవసరాలన్నింటినీ కవర్ చేయడానికి ఇది ఖచ్చితంగా సరిపోదు అని ఆయన వివరించారు.

దురదృష్టవశాత్తు, భారతదేశం వేగంగా ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ గా మారుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 101 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. భారతదేశంలో 7 కోట్ల మంది దయబెటిక్స్ ఉన్నారు. 2019 నుంచి ఈ సంఖ్య 44% పెరిగింది. భారతదేశంలో కూడా ప్రీ-డయాబెటిక్స్ ఎక్కువగా ఉన్నారు. దాదాపు 13 కోట్ల 60 లక్షల మంది ప్రజలు మధుమేహం తలుపు తడుతున్నారు. చాలామంది అసాధారణంగా అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉన్నారు. ఈ సమస్య గురించి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంత అవగాహన ఉంది? అనేది ఇప్పుడు ప్రశ్న.

ఇవి కూడా చదవండి

సాధారణంగా, బీమా పాలసీలు ముందుగా ఉన్న అనారోగ్యంగా డయాబెటిస్‌ని కవర్ చేయవు. దీనికి కవరేజ్ ఉన్నప్పటికీ, ఏదైనా క్లెయిమ్‌లు ఆమోదించడానికి చాలా సమయం పట్టవచ్చు. చాలా కంపెనీలు డయాబెటిక్ కవర్‌ని ప్రవేశపెట్టాయి. కానీ అది అన్ని సంబంధిత ఖర్చులను కవర్ చేయదు. కొన్ని ప్లాన్‌లు OPD ఖర్చులను కవర్ చేస్తాయి. కొన్ని చేయవు. రక్త పరీక్షల ఖర్చు 2 ప్లాన్‌ల ద్వారా మాత్రమే కవర్ అవుతున్నాయి. అనేక సార్లు, మధుమేహం నిర్దిష్ట ఆరోగ్య బీమాను కలిగి ఉన్న తర్వాత కూడా, రోగి తన సొంత జేబు నుంచి వ్యాధులకు సంబంధించిన సమస్యలకు చెల్లించక తప్పడం లేదు.

ప్రస్తుతం, మధుమేహాన్ని కవర్ చేసే పాలసీలు 4-5 మాత్రమే ఉన్నాయి. కానీ అవి భారీ ప్రీమియంలతో వస్తాయి. ఉదాహరణకు, HDFC ఎర్గోస్ ఎనర్జీ ప్లాన్‌ని తీసుకోండి. ఇది రూ. 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య బీమా మొత్తాన్ని ఇస్తుంది. రూ.50 లక్షల బీమా మొత్తానికి ప్రీమియం డిమాండ్ రూ.2 లక్షలు. రూ. 50 లక్షల కవర్ కోసం, మీరు రూ. 50,000 వార్షిక ప్రీమియం చెల్లించాలి. వార్షిక ప్రీమియం రూ. 12,000-15,000 మధ్య ఉండే సాధారణ ఆరోగ్య బీమా ప్లాన్‌తో దీన్ని పోల్చితే ఇది ఎంత ఎక్కువో అర్ధం అవుతుంది.

స్టార్ హెల్త్ అండ్‌ అలైడ్ డయాబెటిస్ సురక్షిత ఆరోగ్య బీమా ప్లాన్ రూ. 3,4,5- 10 లక్షల విలువైన బీమా మొత్తాన్ని అందిస్తుంది. కానీ ఇది ఒక పాలసీ వ్యవధిలో అవుట్ పేషెంట్ ఖర్చుల అంటే OPD కోసం క్లెయిమ్ చేయగలిగే మొత్తాన్ని కనిష్టంగా రూ. 1,000 మరియు గరిష్టంగా రూ. 5,500కి పరిమితం చేస్తుంది. ఓపీడీ కవర్ మీ పాలసీ బీమా మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. సంవత్సర కాలంలో ఎటువంటి క్లయింలు చేయకపోతే సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బోనస్ ప్రయోజనాలు ఈ పాలసీలో ఉండవు.

ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ఎన్‌హాన్స్ డయాబెటిస్ ప్లాన్ రూ. 2 లక్షల నుంచి మొదలై రూ. 2 కోట్ల వరకు కవరేజీని అందిస్తుంది. పాలసీదారు ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి బీమా మొత్తంలో 50% విలువైన బోనస్‌ను పొందుతారు. కానీ ఈ ప్లాన్‌లో, బీమా మొత్తం రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్‌ల కింద మాత్రమే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కవర్ అవుతుంది. బజాజ్ అలియన్జ్ లైఫ్ డయాబెటిక్ టర్మ్ ప్లాన్  కేవలం టైప్-2 డయాబెటిక్ నే కవర్ చేస్తుంది. కనిష్టంగా రూ. 25 లక్షల కవర్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్ రక్త పరీక్షలు, డాక్టర్ ఫీజులను కవర్ చేస్తుంది. అయితే ఇది 60 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఇవ్వరు.

మధుమేహం ఆరోగ్య ప్రణాళిక పాలసీదారులకు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని అందిస్తుంది. అతని లేదా ఆమె ఆరోగ్యాన్ని విశ్లేషించిన తర్వాత, చెల్లించాల్సిన ప్రీమియం నిర్ణయిస్తారు. మీరు మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేని ఆప్షన్ ఎంచుకుంటే, మీరు అధిక ప్రీమియంలను చెల్లించవలసి ఉంటుంది. అదే మీరు వైద్య పరీక్షలు చేయించుకుంటే, కంపెనీ మీ ఆరోగ్యం ఆధారంగా ప్రీమియం పరిమితులను పెంచవచ్చు లేదా ఒక చెల్లింపు లేదా ఉప పరిమితి నిబంధనను యాడ్ చేయవచ్చు. కోపేమెంట్ అంటే పాలసీదారు మొత్తం చికిత్స ఖర్చులలో కొంత శాతాన్ని ఆర్థికంగా భరించవలసి ఉంటుంది. సబ్‌లిమిట్‌లు అంటే, క్లెయిమ్ మొత్తం ఎక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ నిర్ణీత మొత్తానికి మించి చెల్లించదు.

కేర్ ఫ్రీడమ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ విషయంలో ఇటువంటి పరిమితులు ఉన్నాయి. ఇది పాలసీదారు ఆసుపత్రిలో చేరే ముందు- పోస్ట్ హాస్పిటల్ ఎక్స్ పెన్సేస్ పరిమితిని మొత్తం ఆసుపత్రి ఖర్చులలో 7.5%కి పరిమితం చేస్తుంది. దీనికి మించి, పాలసీదారు తన జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద అతి వేగంగా ప్రపంచ మధుమేహ హబ్ అంటే.. వరల్డ్ డయాబెటిక్ హబ్ గా మనదేశం పేరు పొందుతోంది. కానీ, ఈ ఇబ్బందిలో ఆడుకోవాల్సినంత సరైన ఇన్సూరెన్స్ ప్లాన్స్ మాత్రం అందుబాటులో లేవు. ఉన్న పాలసీలు డయాబెటిక్ పేషెంట్స్ ఖర్చులకు ఏ మాత్రం సరిపోని విధంగా ఉన్నాయి. ప్రస్తుతం డయాబెటిక్ సమస్య ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అదేస్థాయిలో ఇన్సూరెన్స్ అందుబాటులో లేకపోవడం బాధాకరం అని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి