AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యర్థాల నుంచి వైట్‌ గోల్డ్‌ను వెలికి తీస్తున్నారు! ఖనిజాల కొరత తీరుస్తున్న చెత్త కుప్పలు.. ఎలాగంటే?

లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల కొరతతో భారత్, పెరుగుతున్న ఇ-వ్యర్థాలను ప్రత్యామ్నాయ వనరుగా మారుస్తోంది. పట్టణ మైనింగ్ ద్వారా వ్యూహాత్మక ఖనిజాలను వెలికితీయడం దేశ ఆర్థిక వ్యవస్థకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కీలకం. హర్యానాలో ఇ-స్కూటర్ బ్యాటరీల నుండి 'వైట్ గోల్డ్' లిథియంను విజయవంతంగా తయారు చేస్తున్నారు.

వ్యర్థాల నుంచి వైట్‌ గోల్డ్‌ను వెలికి తీస్తున్నారు! ఖనిజాల కొరత తీరుస్తున్న చెత్త కుప్పలు.. ఎలాగంటే?
Strategic Minerals
SN Pasha
|

Updated on: Feb 18, 2026 | 11:58 PM

Share

లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి వ్యూహాత్మక ఖనిజాల కొరతను ఎదుర్కొంటున్న భారత్, పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ-వేస్ట్)ను ప్రత్యామ్నాయ వనరుగా మార్చుకుంటోంది. స్మార్ట్‌ఫోన్లు నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, యుద్ధ విమానాల తయారీ వరకు అవసరమైన ఈ ఖనిజాలను వ్యర్థాల నుంచే వెలికితీయడంపై దృష్టి సారిస్తోంది. నివేదిక ప్రకారం.. దేశంలో వేగంగా పెరుగుతున్న ఇ-వేస్ట్ రంగం ఇప్పుడు కీలక ఖనిజాలకు ఒక బంగారు గనిగా మారుతోంది. దేశీయ మైనింగ్ కనీసం మరో దశాబ్దం పాటు గణనీయమైన ఉత్పత్తి ఇవ్వే అవకాశం లేకపోవడంతో భారత్ తన ఎలక్ట్రానిక్ వ్యర్థాల వైపు మొగ్గు చూపింది.

భారీగా ఇ-వేస్ట్ ఉత్పత్తి

అధికారిక గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం భారత్ సుమారు 1.5 మిలియన్ టన్నుల ఇ-వేస్ట్‌ను ఉత్పత్తి చేసింది. ఇది దాదాపు 2 లక్షల చెత్త ట్రక్కులను నింపే పరిమాణం. అయితే వాస్తవ సంఖ్య దీనికంటే రెట్టింపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యర్థాల్లో హార్డ్‌డిస్కులు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలు ఉండి, వీటిలో అరుదైన భూమి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

హర్యానాలో ‘వైట్ గోల్డ్’ తయారీ

హర్యానా రాష్ట్రంలోని ఎక్సిగో రీసైక్లింగ్ ప్లాంట్‌లో ఆధునిక యంత్రాల సహాయంతో ఈ-స్కూటర్ బ్యాటరీలను మొదట నల్లటి పొడిగా మారుస్తున్నారు. ఆ పొడిని రసాయన ప్రక్రియల ద్వారా ద్రవంగా చేసి, ఫిల్టర్ చేసి, ఆవిరి చేయడం ద్వారా చివరికి చక్కటి తెల్లటి లిథియం పొడిని తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, లిథియంను వైట్ గోల్డ్ గా అభివర్ణించారు.

పట్టణ మైనింగ్‌కు ఆర్థిక విలువ

ఇ-వేస్ట్ నుంచి ఖనిజాలను వెలికితీయడాన్ని పట్టణ మైనింగ్‌గా పిలుస్తారు. పరిశ్రమ అంచనాల ప్రకారం.. ఈ రంగం వార్షికంగా 6 బిలియన్‌ల వరకు విలువ కలిగి ఉంది. ఇది దేశం మొత్తం ఖనిజ అవసరాలను పూర్తిగా తీర్చకపోయినా, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో, సప్లయ్‌ చైన్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్‌లో ఉత్పత్తి అవుతున్న ఇ-వేస్ట్‌లో పెద్ద భాగం ఇప్పటికీ అనధికారిక బ్యాక్‌యార్డ్ వర్క్‌షాప్‌లలోనే విడదీయబడుతోంది. అక్కడ రాగి, అల్యూమినియం వంటి సులభంగా అమ్ముడయ్యే లోహాలకే పరిమితం అవుతూ, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాలు వృథా అవుతున్నాయి.

అంతర్జాతీయంగా వెనుకబాటు

చైనా, యూరోపియన్ యూనియన్‌లు అధునాతన రికవరీ టెక్నాలజీ, ట్రేసబిలిటీ సిస్టమ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టగా, భారత్‌లో అధికారిక రీసైక్లింగ్ సామర్థ్యం ఇంకా పరిమితంగానే ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రకారం, భారత్ లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాల విషయంలో ఇప్పటికీ 100 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us