AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: గ్యాస్ బర్నర్ నల్లగా మారి మంట చిన్నగా వస్తుందా.. ఇలా చేస్తే నిమిషాల్లోనే కొత్తదానిలా మెరిసిపోవడం పక్కా..

వంటగది ఎంత నీట్‌గా ఉన్నా.. గ్యాస్ బర్నర్లు నల్లగా, జిడ్డుగా కనిపిస్తే ఆ లుక్కే పాడైపోతుంది. పాలు పొంగినా, పప్పు ఒలికినా స్టవ్ పైపైన తూడుస్తాం కానీ బర్నర్లను మాత్రం అస్సలు పట్టించుకోం. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. మరి రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉండే వాటితోనే ఆ నల్లటి బర్నర్లను ఐదు నిమిషాల్లో కొత్తవాటిలా ఎలా మెరిపించాలో తెలుసుకుందాం.

Video: గ్యాస్ బర్నర్ నల్లగా మారి మంట చిన్నగా వస్తుందా.. ఇలా చేస్తే నిమిషాల్లోనే కొత్తదానిలా మెరిసిపోవడం పక్కా..
How To Clean Gas Burner At HomeImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Jun 04, 2026 | 12:42 PM

Share

ఇంట్లో వంట చేసేటప్పుడు పాలు పొంగిపోవడం, పప్పు లేదా టీ లాంటివి గ్యాస్ స్టవ్‌పై ఒలికిపోవడం సర్వసాధారణం. చాలామంది గ్యాస్ స్టవ్‌ను పైన వెంటనే శుభ్రం చేస్తారు కానీ బర్నర్‌ను మాత్రం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల బర్నర్ రంధ్రాలలో జిడ్డు, నల్లటి మొండి మరకలు పేరుకుపోయి.. మంట సరిగ్గా రాక గ్యాస్ కూడా వృథా అవుతుంది. మీ ఇంట్లో కూడా గ్యాస్ బర్నర్లు నల్లగా మారాయా? అయితే రూపాయి ఖర్చు లేకుండా వాటిని కొత్తవాటిలా మెరిపించే 3 అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

చిట్కా 1: ఈనో – నిమ్మరసం కాంబినేషన్

ఇంట్లో ఈనో ప్యాకెట్ ఉంటే చాలు, బర్నర్లను ఈజీగా క్లీన్ చేయవచ్చు.

కావలసినవి: వేడి నీళ్లు, నిమ్మరసం, ఒక ఈనో ప్యాకెట్, అర చెంచా డిష్‌వాషింగ్ లిక్విడ్.

చేసే విధానం: ముందుగా ఒక మగ్గులో వేడి నీటిని తీసుకోండి. అందులో నిమ్మరసం, ఈనో పౌడర్, డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్‌ను అరగంట పాటు నానబెట్టండి. ఆ తర్వాత పాత టూత్‌బ్రష్‌తో తేలికగా రుద్దితే, నిమిషాల్లోనే నలుపంతా వదిలిపోయి బర్నర్ కొత్తదానిలా మెరుస్తుంది.

చిట్కా 2: బేకింగ్ సోడా, కోల్‌గేట్ మ్యాజిక్

మొండిగా మారిన నల్లటి జిడ్డును వదిలించడంలో కోల్‌గేట్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది.

కావలసినవి: బేకింగ్ సోడా, నిమ్మరసం, కోల్‌గేట్ పేస్ట్, వేడి నీళ్లు.

చేసే విధానం: బర్నర్‌ను ఒక ప్లేట్‌లో ఉంచి, దానిపై బేకింగ్ సోడా చల్లండి. ఆ వెంటనే నిమ్మరసం పిండండి. చివరగా బర్నర్ చుట్టూ కోల్‌గేట్ పేస్ట్ రాసి, బ్రష్ సహాయంతో బాగా రుద్ది, పైన వేడి నీళ్లు పోయండి. అంతే.. బర్నర్ తళతళా మెరిసిపోతుంది.

చిట్కా 3: బేకింగ్ సోడా – వెనిగర్

వంటగదిలో క్లీనింగ్‌కు వెనిగర్ ఒక బెస్ట్ ఆప్షన్.

కావలసినవి: అర కప్పు నీరు, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిగర్.

చేసే విధానం: గ్యాస్ స్టవ్ నుండి బర్నర్లను తీసి పక్కన పెట్టండి. అర కప్పు నీటిలో బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి ఆ నీటిలో బర్నర్లను కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత నార్మల్ స్క్రబ్బర్ సహాయంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.

గ్యాస్ స్టవ్ ఎక్కువ కాలం మితంగా, నీట్ గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పవు:

  • ప్రతిరోజూ రాత్రి వంట పూర్తయిన తర్వాత డిష్‌వాషింగ్ లిక్విడ్ ఉపయోగించి గ్యాస్ స్టవ్‌తో పాటు బర్నర్‌ను కూడా క్షుణ్ణంగా శుభ్రం చేయండి.
  • గ్యాస్‌పై నూనె లేదా మసాలాలు పడితే వెంటనే తుడిచేయండి. లేదంటే వేడికి ఆ మరకలు గట్టిపడిపోయి, తర్వాత వదలడం కష్టమవుతుంది.

వీడియో చూడండి

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో