Mobile Data: మొబైల్ డేటా వినియోగంలో దూసుకెళ్తున్న భారత్.. స్మార్ట్‌ఫోన్లు పెరగడమే కారణమా..

దేశంలో స్మార్ట్‎ఫోన్లు వినియోగం పెరుగుతోంది. టెలికామ్ కంపెనీలు తక్కువ ధరకు డేటాను అందించడంతో ఇంటర్నెట్‎ను విరివిగా వాడుతున్నారు. దేశంలో ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు...

Mobile Data: మొబైల్ డేటా వినియోగంలో దూసుకెళ్తున్న భారత్.. స్మార్ట్‌ఫోన్లు పెరగడమే కారణమా..
Data
Follow us

|

Updated on: Oct 23, 2021 | 9:41 PM

దేశంలో స్మార్ట్‎ఫోన్లు వినియోగం పెరుగుతోంది. టెలికామ్ కంపెనీలు తక్కువ ధరకు డేటాను అందించడంతో ఇంటర్నెట్‎ను విరివిగా వాడుతున్నారు. దేశంలో ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరుగుతున్నారు. దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 1.18 బిలియన్ మొబైల్ కనెక్షన్లు, 700 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు, 600 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని తెలిపారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో శర్మ ప్రసంగించారు.

గత 6-7 సంవత్సరాల్లో అపారమైన పురోగతిని చూశామని చెప్పారు. ప్రధానమంత్రి ఊహించిన డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లకు అనుకూలంగా ఉందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఆధార్, కోవిన్ ఇప్పటికే ప్రజల జీవితాలను మార్చాయని తెలిపారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1978-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి అయిన శర్మ గతంలో ట్రాయ్ ఛైర్మన్‌గా పని చేశారు. దేశంలో ఫైబర్ ఆధారిత నెట్‌వర్క్‌ల విస్తరణ ద్వారా కనెక్టివిటీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చాలావరకు టెలికాం ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్‌లకు మారిన నేపథ్యంలో.. స్థానికంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

దేశంలో డేటా రేట్లు చౌకగా ఉన్నందున ప్రజలు వీడియో కాల్స్, సినిమాలు చూస్తున్నారని శర్మ తెలిపారు. సెప్టెంబర్ 2016 లో ప్యూర్‌ప్లే 4G ఆపరేటర్ రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో మార్పును వచ్చిందని.. సమర్థవంతమైన డేటా టారిఫ్‌కు దారితీసిందని పేర్కొన్నారు. 2025 నాటికి భారతదేశంలో ప్రతి వ్యక్తికి డేటా వినియోగం దాదాపు 25 జీబీకి రెట్టింపు అవుతందని చెప్పారు.

Read Also.. Singapore: భారతీయులకు శుభవార్త.. అక్టోబర్ 26 నుంచి సింగపూర్‎కు వెళ్లొచ్చు..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో