Singapore: భారతీయులకు శుభవార్త.. అక్టోబర్ 26 నుంచి సింగపూర్‌కు వెళ్లొచ్చు..
సింగపూర్‌కు అక్టోబర్ 26 నుంచి భారత్ ప్రయాణికులను అనుమతించనున్నారు. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చేవారిని కూడా అనుమతించనున్నారు...
సింగపూర్‌కు అక్టోబర్ 26 నుంచి భారత్ ప్రయాణికులను అనుమతించనున్నారు. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చేవారిని కూడా అనుమతించనున్నారు. అక్టోబర్ 26 రాత్రి 11.59 గంటల నుండి సింగపూర్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కానీ ప్రయాణికులు గత 14 రోజుల్లో ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ప్రయాణికులు క్వారంటైన్ నియమాలను తప్పకుండా పాటించాలి. 10 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంతకుముందు సింగపూర్ మరో 15 దేశాల నుండి పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. స్థానిక గృహాల్లో పని చేయడానికి టీకాలు వేయించుకున్న వారినే అనుమతించింది. కోవిడ్-19పై బహుళ-మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ తీసుకున్న అనేక కొత్త చర్యలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్న కఠినమైన ఆంక్షలను పొడిగించారు. నవంబర్ 21, 2021 వరకు ఒక నెల పాటు పొడిగించారు. జనవరి 1, 2022 నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న వారు లేదా గత 270 రోజులలో కోవిడ్-19 నుండి కోలుకున్న ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
“టీకా వేయించుకోని ఉద్యోగులు కోవిడ్ నెగటివ్ అని ధ్రువపత్రం చూపించాలని స్పష్టం చేసింది. భారతదేశంలో సీనియర్ విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను తక్షణమే ఎత్తివేసే అవకాశం లేదని చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నిలిపివేశారు. అంతర్జాతీయ విమానాలను నడపడానికి భారతదేశం 25 కంటే ఎక్కువ దేశాలతో ఎయిర్ బబుల్ ఏర్పాట్లను కలిగి ఉంది.
Read Also.. Firing: బర్త్‌డే కోసం మెక్సికో వెళ్లింది.. రెస్టారెంట్లో భోజనం చేస్తుండగా కాల్పులు.. చివరికి..