AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firing: బర్త్‎డే కోసం మెక్సికో వెళ్లింది.. రెస్టారెంట్‎లో భోజనం చేస్తుండగా కాల్పులు.. చివరికి..

మెక్సికోలో జరిగిన కాల్పుల్లో భారతీయ సంతతికి చెందిన మహిళ మృతి చెందింది. కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళా టెక్కీ తన పుట్టినరోజును జరుపుకోవడానికి మెక్సికోకు వెళ్లింది...

Firing: బర్త్‎డే కోసం మెక్సికో వెళ్లింది.. రెస్టారెంట్‎లో భోజనం చేస్తుండగా కాల్పులు.. చివరికి..
Riyot
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 5:07 PM

Share

మెక్సికోలో జరిగిన కాల్పుల్లో భారతీయ సంతతికి చెందిన మహిళ మృతి చెందింది. కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళా టెక్కీ తన పుట్టినరోజును జరుపుకోవడానికి మెక్సికోకు వెళ్లింది. అక్కడ కరేబియన్ తీరప్రాంత రిసార్ట్ తులమ్‎కు వెళ్లారు. అక్కడ రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆమెతోపాటు మరొక పర్యాటకురాలు బుల్లెట్ తగిలి మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన గత బుధవారం జరిగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో నివసిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంజలి రియోట్ తను ట్రావెల్ బ్లాగర్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. ఆమె లింక్డ్‌ఇన్‌లో సీనియర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రియోట్ ఇంతకుముందు యాహూలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 22న ఆమె జన్మదినానికి ముందు సోమవారం ర్యోత్ తులం చేరుకున్నారు.

గత బుధవారం రాత్రి రియోట్, మరో నలుగురు విదేశీ పర్యాటకులు లా మల్క్వెరిడా రెస్టారెంట్ టెర్రస్‌లో భోజనం చేస్తున్నారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న టేబుల్‌పై కాల్పులు జరిపినట్లు స్పానిష్ వార్తాపత్రిక ఎల్ పైస్ నివేదించింది. వారికి బుల్లెట్లు తాగిలాయి. కాల్పుల్లో అంజలి రియోట్‎తోపాటు జర్మన్ టూరిస్ట్‌ మరణించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు నిర్వహిస్తున్న రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య ఈ పోరాటం జరిగిందని క్వింటానా రూ స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మెక్సికన్ రాష్ట్రంలో అనేక డ్రగ్ కార్టెల్‌లు పనిచేస్తున్నాయి, ఇది లాభదాయకమైన రిటైల్ డ్రగ్ మార్కెట్‌గా డ్రగ్ షిప్‌మెంట్‌లకు ల్యాండింగ్ స్పాట్‌గా పేరుగాంచిందని మెక్సికో సిటీ నుండి అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఇంతలో, రియోట్ సోదరుడు ఆశిష్ రియోట్ సోదరి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రక్రియను వేగవంతం చేయాలని తులుం మేయర్‌ను కోరినట్లు ఎల్ పైస్ నివేదిక తెలిపింది.

Read Also.. Indian Scientist: భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి…ఆవాల మొక్క నుంచి విమాన ఇంధనం తయారీ

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే