Indian Scientist: భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి…ఆవాల మొక్క నుంచి విమాన ఇంధనం తయారీ

Indian Scientist Puneet: శాస్త్రవేత్తలు మానవాళికి ప్రయోజనం చేకూర్చే ప్రయోగాలను చేస్తూ నిరంతం శ్రమిస్తూనే ఉంటారు. తమ మేథస్సుకు పదును పెట్టి... సరికొత్త..

Indian Scientist: భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి...ఆవాల మొక్క నుంచి విమాన ఇంధనం తయారీ
Indian Scientist Puneet
Follow us

|

Updated on: Oct 21, 2021 | 2:07 PM

Indian Scientist Puneet: శాస్త్రవేత్తలు మానవాళికి ప్రయోజనం చేకూర్చే ప్రయోగాలను చేస్తూ నిరంతం శ్రమిస్తూనే ఉంటారు. తమ మేథస్సుకు పదును పెట్టి… సరికొత్త ఆవిష్కరణలో చరిత్రలో తమ పేరుని లిఖించుకుంటారు. తాజా భారత సంతతికి చెందిన పునీత్ ద్వివేదీ పేరు అమెరికాలో హోరెత్తిపోతోంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. పునీత్ సరికొత్త ఆవిష్కరణ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. పునీత్ ద్వివేదీ అగ్రరాజ్యం అమెరికాలో శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు. తన అధ్బుతమైన మేథస్సుతో పర్యావరణానికి మేలు చేసే ఆవిష్కరణ చేశారు. దీంతో ఇప్పుడు పునీత్ పేరు ప్రపంచమంతటా మారుమోగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ను నివారించడం కోసం ఆయన చేసిన ఆవిష్కరణ గురించి వివరల్లోకి వెళ్తే..

భారత సంతతికి చెందిన పునీత్ ద్వివేది అమెరికాలో స్థిరపడ్డారు. జార్జియా వర్సిటీ లోని వార్నల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ నెచ్యురల్ రిసోర్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంధనాల వాడకంతో రోజురోజుకీ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని.. సరికొత్తగా ప్రాజెక్ట్ ను చేపట్టారు. దివ్వేదీ ఆయనతో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. మొక్కల నుంచి ఇంధనం తయారు చేసి… దానిని ప్రస్తుతం విమానాల కోసం వాడుతున్న పెట్రోలియం ఇంధనాన్ని భర్తీ చేయాలనీ భావించారు. పునీత్ ద్వివేది నాయకత్వంలో ఆహారానికి పనికిరాని ఒకరకమైన ఆవాల మొక్కల నుంచి నూనె ఏవియేషన్ ఫ్యూయల్ ను తయారు చేశారు.

ఆవాల నుంచి వచ్చే నూనెతో విమాన ఇంధనం తయారు చేయవచ్చునని దివ్వేది నిరూపించారు. ఆవాలు మొక్కల నుంచి తీసిన ఇంధనం తో విమానాలు నడపడం వలన ప్రస్తుతం వాడుతున్న ఇంధనం నుంచీ వెలువడే కార్భన ఉద్గారాలను 68 శాతం తగ్గించవచ్చని ఈ బృందం చెబుతుంది. అంతేకాదు విమాన ఇంధనం ధరతో పోల్చితే ఆవాలు ఇంధనం ధర తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముడిసరుకు, ఆర్థిక మద్దతు ఇస్తే ఈ పరిశోధనను మరింత వేగవంతం చేస్తామని ద్వివేదీ బృందం ప్రకటించింది.

ద్వివేది కనుగొన్న ఇంధనం సరైన సమయంలో వస్తుందని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు. సెప్టెంబర్‌లో జో బిడెన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ గ్రాండ్ ఛాలెంజ్‌లో భాగంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 2030 నాటికి విమానయాన ఉద్గారాలలో 20% తగ్గుదల .. 2050 నాటికి పూర్తిగా జీరో-కార్బన్ విమానయాన రంగాన్ని సాధించాలని బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read:  పెళ్ళైన రెండేళ్లకే ఆస్తమాతో భర్త మృతి.. భర్త చితాభస్మం తింటూ.. ఆయన నాతోనే ఉన్నాడంటున్న భార్య..