AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: పెళ్ళైన రెండేళ్లకే ఆస్తమాతో భర్త మృతి.. భర్త చితాభస్మం తింటూ.. ఆయన నాతోనే ఉన్నాడంటున్న భార్య

Shocking: పెళ్లితో రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా మారతారు. ఆలుమగలు కష్టం, సుఖం,..

Shocking: పెళ్ళైన రెండేళ్లకే ఆస్తమాతో భర్త మృతి.. భర్త చితాభస్మం తింటూ.. ఆయన నాతోనే ఉన్నాడంటున్న భార్య
Shocking Video
Surya Kala
|

Updated on: Oct 21, 2021 | 1:35 PM

Share

Shocking: పెళ్లితో రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా మారతారు. ఆలుమగలు కష్టం, సుఖం, సంతోషం… ఇలా అన్నింటిని పంచుకుంటూ.. జీవితాంతం తోడునీడగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొంతమంది భార్యాభర్తల బంధాన్ని కాలం మరణం పేరుతో విడదీస్తుంది. అప్పుడు తమ తోడు లేనప్పుడు తాను ఎందుకు అంటూ.. ఆత్మహత్యకు పాల్పడిన వారి గురించి విన్నాం.. ఇంకొందరు తమ భర్త, లేదా భార్య జ్ఞాపకార్ధం విగ్రహాలు నిర్మించడం.. మంచి పనులు చేస్తూ.. వాటికీ తమ భాగస్వామి పేరు పెట్టి.. తమ ప్రేమను వ్యక్తం చేసిన సంఘటనలు అనేకం విన్నాం.. అయితే తాజాగా ఓ మహిళ తన ప్రేమ అందరికంటే భిన్నం అనుకుంది.. మరణించిన భర్తపై తనకు ప్రేమను డిఫరెంట్ గా వ్యక్తం చేస్తుంది. అయితే ఆ మహిళ ప్రేమని చూసిన నెటిజన్లు ఇదేమీ ప్రేమరా బాబాయ్ అంటున్నారు. మరి అంతగా నెటిజన్లను భయపెడుతున్న ఆ ప్రేమ ఏమిటో తెలుసా.. మరణించిన భర్త చితా భస్మాన్ని రోజూ కొంచెం కొంచెం తింటూ ఎంజాయ్ చేస్తోంది. ఈ వింత మహిళ గురించి వివరాల్లోకి వెళ్తే…

బ్రిటన్‌కి చెందిన 26 ఏళ్ల కాసీ అనే మహిళ 2009లో సీన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన రెండేళ్లకే కాసీ భర్త  ఆస్తమా తో  భర్త  మరణించాడు.. కన్నీటి నడుమ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే కాసీ తన భర్తని బూడిద చేసిన భస్మాన్ని వెంట ఇంటికి తెచ్చుకుంది. తన భర్త అంటే ప్రాణమని ఆ చితా చితాభస్మాన్ని ఎక్కడైకి వెళ్ళినా తనతో తీసుకుని వెళ్తుంది. ఇలా చేస్తే.. తనకు తోడుగా తన భర్త ఉన్నట్లు ఫీలింగ్ వస్తుందని చెబుతుంది. అయితే భర్త మీద ప్రేమ ముదిరింది. దీంతో భర్త చితాభస్మాన్ని చాక్లెట్ లా తింటూ ఎంజాయ్ చేస్తోంది.

ఎవరైనా ఇదేమిటి అంటే.. నా భర్త నా ఇష్టం.. అంటే నాకు ప్రాణం..ఆయన లేడు కాబట్టి ఈ చితాభస్మంలోనే ఆయని చూసుకుంటున్నా.. రోజు రోజుకి కొంచెం తినడంమొదలు పెట్టా.. ఇప్పుడు ఈ చితాభస్మం తినకుండా ఉండలేని విధంగా బానిస అయ్యాను అంటోంది. చితా భస్మం దుర్వాసన వస్తున్నా తినడం మనలేకపోతున్నానంతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ అవుతుంది. భర్త అంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇదేం ప్రేమరా బాబూ అంటూ సదరగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై కాసీ స్పందిస్తూ.. నేను జీవించి ఉన్నంతకాలం నా భర్త నాతోనే ఉంటాడు అన్న భావన ఇది ఇస్తుందని చెబుతుంది. అంతేకాదు.. నా గురించి ఎవరు ఏమనుకున్నా లేక్కచేయను.. భర్తపోయిన తర్వాత ఆయన రాడని తెలుసు.. ఎంతగానో ఏడిచాను.. అయితే ఈ భూమి మీద నా భర్తను గుర్తు చేసేది ఈ చితా భస్మం.. ఈ జ్ఞాపకాన్ని తాను తడిచివేయలను భావించడం లేదంటూ కామెంట్ చేసింది. తన భర్త చితాభస్మం తింటున్న విషయం కాసీ స్వయంగా బ్రిటన్‌ టీఎల్‌సీ ఛానెల్‌లోని ‘మై స్ట్రేంజ్‌ అడిక్ట్‌’ అనే కార్యక్రమంలో ప్రపంచానికి చెప్పింది. దీంతో బాబాయ్ ఈ వింత ప్రేమ ఏమిటో అంటూ నేట్టింట్లో కామెంట్స్ హాల్ చల్ చేస్తున్నాయి.

Also Read: ఆటతోనే కాదు పాటతోనూ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్న భారత మహిళా క్రికెటర్స్