Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! త్వరలో మళ్లీ ఆ సేవలు ప్రారంభం..
Indian Railway: దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పడుతున్నందున రైళ్లలో క్యాటరింగ్ సేవలు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలను తిరిగి
Indian Railway: దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పడుతున్నందున రైళ్లలో క్యాటరింగ్ సేవలు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలను తిరిగి ప్రారంభించాలని భారతీయ రైల్వే ఆలోచిస్తున్నట్లు సమాచారం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చే వారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని IRCTC వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో రైళ్లలో అందించే ఆహారానికి సంబంధించిన సేవలను ప్రారంభించడంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిపారు.
ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని వివిధ కమిటీలు రైల్వేకి రిపోర్ట్ పంపినట్లు ఒక పోర్టల్ నివేదించింది. అంతేకాకుండా బేస్ కిచెన్, ఆన్-బోర్డ్ కిచెన్, బెడ్ రోల్స్ అందించడం, దుప్పటిని ప్రారంభించడంపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ముఖ్యంగా COVID-19, లాక్‌డౌన్ కారణంగా ఈ-క్యాటరింగ్ సేవలు మార్చి 2020 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ప్యాంట్రీ సేవలు లేనప్పుడు.. భారతీయ రైల్వేలు నడుపుతున్న దాదాపు అన్ని రైళ్లలో రైల్‌రెస్ట్రో వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి నేరుగా రైళ్లలో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ప్రయాణికులకు అనుమతి ఉంది. ఈ ఏడాది జనవరిలో IRCTC- అధీకృత ఈ-క్యాటరింగ్ వింగ్ అయిన రైల్‌రెస్ట్రో, రైళ్ల లోపల సేవలను తిరిగి ప్రారంభించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందింది. రెస్టారెంట్ సిబ్బంది, డెలివరీ సిబ్బందిని ప్రతి రోజు థర్మల్ స్కానింగ్ చేయడం, రోజూ కిచెన్‌లను శానిటైజేషన్ చేయడం, రెస్టారెంట్ సిబ్బంది, డెలివరీ సిబ్బంది ద్వారా రక్షిత ఫేస్ మాస్క్‌లు లేదా ఫేస్ షీల్డ్‌ల వాడకం వంటి కఠినమైన మార్గదర్శకాలను కంపెనీ నిర్దేశించింది.