AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఐడెన్ మక్రమ్.. పెవిలియన్ చేరిన స్టీవ్ స్మిత్..

టీ20 వరల్డ్ కప్‎లో అప్పుడే అద్భుతాలు ప్రారంభమయ్యాయి. దక్షిణాఫ్రికా ఆటగాడు మక్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. గాల్లో ఎగిరి బంతి అందుకున్నాడు.....

T20 World Cup 2021: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఐడెన్ మక్రమ్.. పెవిలియన్ చేరిన స్టీవ్ స్మిత్..
Makram
Srinivas Chekkilla
|

Updated on: Oct 23, 2021 | 7:57 PM

Share

టీ20 వరల్డ్ కప్‎లో అప్పుడే అద్భుతాలు ప్రారంభమయ్యాయి. దక్షిణాఫ్రికా ఆటగాడు మక్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. గాల్లో ఎగిరి బంతి అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12 దశలోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాంటింగ్‎కు చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 118 పరుగులు చేసింది. 119 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‎కు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో స్మిత్ ఔటయ్యాడు. అన్రిచ్ నుంచి వచ్చిన బంతిని స్మిత్ ఫుల్ షాట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వైడ్ లాంగ్-ఆన్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న మక్రమ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. డైవింగ్ చేసి బంతిని అందుకున్నాడు. దీంతో 35 పరుగులకు స్మిత్ వెనుతిరిగాడు.

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మక్రమ్ 36 బంతుల్లో 40 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమ్మిన్స్ ‍‍ఒక్కో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసి ప్రోటీస్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్‎లో కెప్టెన్ ఫించ్ ఐదు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. డెవిడ్ వార్నర్ మరోసారి నిరాశపరిచాడు. స్టీవ్ స్మిత్ 35, మార్కస్ స్టోయినిస్ 24, గ్లెన్ మాక్స్‌వెల్ 24 పరుగులు చేశారు. అన్రిచ్ 2 వికెట్లు, రబడా, కేశవ్, శంషి ఒక్కో వికెట్ తీశారు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

Read Also.. T20 World Cup 2021: ఆ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి.. పాక్ జట్టుకు యూనిస్ ఖాన్ హెచ్చరిక..