AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: పాకిస్తాన్‌ క్రికెటర్లకు సూపర్‌ ఆఫర్.. ఇండియాని ఓడిస్తే బ్లాంక్ చెక్ రెడీ..

Ind Vs Pak: భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్లింగ్‌ పీక్స్‌లో ఉంటుంది.

Ind Vs Pak: పాకిస్తాన్‌ క్రికెటర్లకు సూపర్‌ ఆఫర్.. ఇండియాని ఓడిస్తే బ్లాంక్ చెక్ రెడీ..
Ind Vs Pak
uppula Raju
|

Updated on: Oct 23, 2021 | 6:27 PM

Share

Ind Vs Pak: భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్లింగ్‌ పీక్స్‌లో ఉంటుంది. టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. దాయాదుల పోరు కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత ఇరు జట్లు మళ్లీ తలపడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఓ యుద్ధం లాంటిది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగిందంటే ఫ్యాన్స్ ఓ యుద్ధం జరిగినట్లుగా ఫీల్ అవుతారు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారు.

అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డ్‌ చైర్మన్‌ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్.. ఇండియాని ఓడిస్తే ఆటగాళ్ల కోసం బ్లాంక్ చెక్ రెడీగా ఉందని ప్రకటించారు. పీసీబీని బలోపేతం చేసేందుకు ఓ ఇన్వెస్టర్ ఈ ఆఫర్ ఇచ్చారని రమీజ్ రాజా తెలిపారు. అయితే ఐసీసీ ఇస్తున్న 50 శాతం నిధులతోనే ప్రస్తుతం పీసీబీ బోర్డు నడుస్తోంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

సీసీకి 90 శాతం నిధులు బీసీసీఐ నుంచి అందుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే అటు ఐసీసీ, పీసీబీ బోర్డు కుప్పకూలే ప్రమాదముందని వెల్లడించారు. పీసీబీ బోర్డు చైర్మన్ ప్రకటనతో పాక్ క్రికెటర్లు ఎలాగైనా ఈ మ్యా్చ్‌లో గెలవాలని ఉవ్విళ్లురుతూ ఉండగా, ఎన్నో ఏళ్లుగా దాయాది జట్టుతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీం ఇండియా సైతం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..

Viral Video: తరగతి కిటికీ దగ్గర కదులుతున్న ఆకారం.. భయంతో వెళ్లిన విద్యార్ధులు.. చూడగానే షాక్.!

Viral Video: నాగుపాము పడగ విప్పి బుస కొడితే ఎట్లుంటదో తెలుసా.? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియో..