Viral Video: తరగతి కిటికీ దగ్గర కదులుతున్న ఆకారం.. భయంతో వెళ్లిన విద్యార్ధులు.. చూడగానే షాక్.!
అది జిల్లా పరిషత్ హైస్కూల్. పాత బిల్డింగ్ కాబట్టి.. చాలావరకు శిథిలావస్థకు చేరుకుంది. ఇక పిల్లలు ఎప్పటిలానే స్కూల్‌కు చేరుకున్నారు...
అది జిల్లా పరిషత్ హైస్కూల్. పాత బిల్డింగ్ కాబట్టి.. చాలావరకు శిథిలావస్థకు చేరుకుంది. ఇక పిల్లలు ఎప్పటిలానే స్కూల్‌కు చేరుకున్నారు. తమ తరగతి గదిలోకి వెళ్లిన వారికి కిటికీ దగ్గర ఏదో ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. చుట్టూ పిచ్చి మొక్కలు గుబురుగా పెరిగిపోయి ఉండటంతో.. క్లాసులో కొంచెం చీకటి అలుముకుంది. ఆ విద్యార్ధులు భయపడుతూనే.. అదేంటోనని చూడటానికి వెళ్లగా.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఓ పాము కిటికీపైకి పాకుతూ కనిపించింది. అంతే.. భయంతో బయటికి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని కొప్పర్రు మండలంలోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు ఎక్కువైపోయాయి. అవి గుబురుగా పెరిగిపోవడంలో తరగతి గదుల్లోకి సరీసృపాల రావడం మొదలయ్యాయి. తాజాగా ఓ తరగతి గది కిటికీపైకి పాము పాకుతుండగా.. విద్యార్ధులు చూసి భయంతో పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనతో ఖంగారుపడిన విద్యార్ధుల తల్లిదండ్రులు.. అధికారులు వెంటనే స్పందించిన స్కూల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే కడుపు కోత తప్పదని.. ఈ అంశంపై దృష్టి సారించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.