Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏడుగురు భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశమయ్యారు.100 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల మైలురాయిని

PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..
Pm
Follow us
uppula Raju

|

Updated on: Oct 23, 2021 | 5:36 PM

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏడుగురు భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశమయ్యారు.100 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌ల మైలురాయిని సాధించిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ కాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ వంటి ఏడు వ్యాక్సిన్ తయారీదారుల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

భారతదేశంలోని అర్హులైన వ్యక్తులకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని ప్రధానమంత్రి సూచించారు. “అందరికీ వ్యాక్సిన్” అనే మంత్రంలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు 101.30 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

100 కోట్ల డోస్ కరోనా టీకా ప్రచారంలో భాగంగా అక్టోబర్ 21న భారతదేశం100 కోట్ల డోస్ మార్కును దాటింది. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు తెలిపే ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలోని 75 శాతం కంటే ఎక్కువ మంది ఒక మోతాదును పొందగా దాదాపు 31 శాతం మంది రెండు మోతాదులను పొందారు. తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అర్హులైన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు.

టీకా ప్రచారం జనవరి 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. తరువాత ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టీకాలు వేశారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికి టీకాలు వేశారు. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి టీకాలు వేయడం ప్రారంభించారు.18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకాలు వేయడం మొదలైంది.

Firing: బర్త్‎డే కోసం మెక్సికో వెళ్లింది.. రెస్టారెంట్‎లో భోజనం చేస్తుండగా కాల్పులు.. చివరికి..

Diwali Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే దీపావళి ప్రత్యేక రైళ్ల వివరాలు

Kamal Haasan: మరో కొత్త దారిలో కమల్‌ ప్రయాణం.. ఈసారి వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్న లోక నాయకుడు..