Diwali Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే దీపావళి ప్రత్యేక రైళ్ల వివరాలు
Indian Railways - Diwali Special Trains: రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది.
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. విశాఖపట్నం – సికింద్రాబాద్, విశాఖపట్నం – తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ప్రారంభించింది. నవంబరు 2న (మంగళవారం) సాయంత్రం 5.35 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు(నెం.08585) మరుసటి రోజు(బుధవారం) ఉదయం 07.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే నవంబరు 3న(బుధవారం) రాత్రి 09.05 గంజలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు (నెం.08586) మరుసటి రోజు(గురువారం) ఉదయం 09.50 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లో ఉంటాయి.
అలాగే మరో ప్రత్యేక రైలు(నెం.08583) నవంబరు 1న(సోమవారం) సాయంత్రం 07.15 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు(మంగళవారం) ఉదయం 07.30 గం.లకు తిరుపతి చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైలు(నెం.08584) తిరుపతి నుండి నవంబరు 2న(మంగళవారం) రాత్రి 09.55 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు(బుధవారం) ఉదయం 10.20 గం.లకు విశాఖపట్నం చేరుకోనుంది.ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
Special Trains Between Visakhapatnam – Secunderabad and Visakhapatnam – Tirupati #festival #specialtrains #Diwali pic.twitter.com/wpVuwWmMMR
— South Central Railway (@SCRailwayIndia) October 21, 2021
అలాగే దీపావళి పండుద దృష్ట్యా టాటా నగర్- కాచిగూడ, యశ్వంత్‌పూర్ – హెచ్.నిజాముద్దీన్ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది.
Special Trains Between TATA – Kacheguda and Yesvantapur – H. Nizamuddin#festival #specialtrains #Diwali pic.twitter.com/jB6oenWd2R
— South Central Railway (@SCRailwayIndia) October 21, 2021
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది.
Also Read..
ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్..! దీపావళికి ముందు ఆ నియోజకవర్గానికి 5229 కోట్ల కేటాయింపు..
Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున.. కెప్టెన్సీ క్యాన్సిల్ అంటూ..