ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్..! దీపావళికి ముందు ఆ నియోజకవర్గానికి 5229 కోట్ల కేటాయింపు..
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 25 న తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు. ఈ సమయంలో
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 25 న తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు. ఈ సమయంలో నియోజకవర్గంలో దాదాపు 30 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటికి దాదాపుగా 5229.96 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ప్రధాని మోదీ వారణాసిలో దాదాపు 2.30 గంటలు ఉంటారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పర్యటన చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ పథకాల ద్వారా వారణాసి పునర్వైభవం పొందుతుంది.
ప్రధానమంత్రి నియోజకవర్గంలో అనేక పథకాలకు జెండా ఊపి శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి స్వస్త్ భారత్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దేశంలో 65 వేల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఈ పథకంతో పాటు దేశవ్యాప్తంగా ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రధాని మోడీ ప్రచారాన్ని షురూ చేస్తారు. దీనితో పాటు వారణాసిలో జరిగే బహిరంగ సభలో కూడా మోదీ ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ పిఎం మోదీ మెహందీగంజ్ గ్రామంలో జరుగుతుంది. కరోనా కాలం తర్వాత పిఎం మోడీ మొదటి బహిరంగ సభ ఇదే కావడం విశేషం.
సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ ఉదయం సిద్ధార్థనగర్‌లో కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ రాష్ట్రంలో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏకకాలంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభంకాబోతున్నాయి. ఈ కళాశాలల ప్రారంభంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మరింత పటిష్టం అవుతాయని వైద్యుల సంఖ్య కూడా పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) జిల్లా యంత్రాంగంతో సమావేశమై ప్రధాని మోదీ కార్యక్రమాన్ని ఖరారు చేస్తుంది.