India Coronavirus: కరోనా మరణ మృదంగం.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,326 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 666 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది
తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,59,562 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,53,708కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,73,728 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 233 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది.
నిన్న కరోనా నుంచి 17,677 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,35,32,126 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.16 శాతానికి పెరిగిందని కేంద్రం వెల్లడించింది. మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు భారీగా పెరిగినట్లు తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/0o7u4nzsBp pic.twitter.com/fnmj6K7Sjk
— Ministry of Health (@MoHFW_INDIA) October 23, 2021
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,01,30,28,411 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. గత 24గంటల్లో 68 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 101.30 Cr (1,01,30,28,411).
➡️ More than 68 Lakh doses administered in last 24 hours.https://t.co/9lD34VbyoK pic.twitter.com/N13ukh3KiH
— Ministry of Health (@MoHFW_INDIA) October 23, 2021
Also Read: