AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..

Trekkers dead: హిమాలయ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన పర్వతారోహకులు మరణించారు. ట్రెక్కర్లు ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..
Trekkers
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2021 | 9:45 AM

Share

Trekkers dead: హిమాలయ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన పర్వతారోహకులు మరణించారు. ట్రెక్కర్లు ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్పిపోయారు. వారిలో 11 మంది పర్వతారోహకులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కనిపించకుండాపోయిన మరో ఆరుగురి కోసం లాంఖగా పాస్‌పై భారత వైమానికి దళం గాలిస్తోందని పేరర్కొన్నారు. పర్వతారోహకులు, గైడ్‌లతో కూడిన 17 మంది బృందం ఈనెల 14న హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా నుంచి ఉత్తరాఖండ్‌లోని ఉత్కర్షికి బయల్దేరారు. ఈ క్రమంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ హిమపాతం, వాతావరణం అనుకూలించకపోవడంతో వారు 18న ఉత్తరాఖండ్‌లోని లాంఖగా పాస్‌ వద్ద తప్పిపోయారు. దీంతో వారికోసం పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, భారత వాయుసేన గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో సముద్ర మట్టం నుంచి 17 వేల మీటర్ల ఎత్తులో ఉన్న లాంఖగా పాస్‌పై వారంతా చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వాయుసేన అధికారులు అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో నిన్నటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

దీంతోపాటు హర్సిల్‌లో తప్పిపోయిన 11 మంది ట్రెక్కర్‌ల బృందంలో ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో ఇద్దరిని సురక్షితంగా రక్షించామని… మరో ఇద్దరు తప్పిపోయినట్లు పేర్కొ్నారు. లంఖాగా పాస్ సమీపంలో అదృశ్యమైన 11 మంది ట్రెక్కర్లల్లో ఐదుగురు ట్రెక్కర్ల మృతదేహాలను కిందకు తెచ్చినట్లు తెలిపారు.

Also Read:

Bathukamma: విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి.. నేడు బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన.. వివరాలివే..

Tirupati Rain: తిరుపతిలో అర్ధరాత్రి వర్ష బీభత్సం.. నీళ్లలో నిల్చిపోయిన వాహనంలో ఇరుక్కుపోయి ఊపిరాడక యువతి మృతి