Petrol Diesel Prices Today: బాదుడే.. బాదుడే.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..!
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతుండంతో..
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతుండంతో ఇబ్బందులు పడుతున్న జనాలకు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెద్ద భారంగా మారుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వాహనం ఉండటం తప్పనిసరి. వాహనాన్ని బయటకు తీయకుండా ఉండలేని పరిస్థితి. దీంతో సామాన్యుడికి జేబుకు చిల్లులుపడుతున్నాయి. ధరలను తగ్గించాలని వాహనదారుల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా.. పెరగడం మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా శనివారం వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.24కి చేరగా, డీజిల్ ధర రూ.95.97కు పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.113.12, డీజిల్ రూ.104కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08, చెన్నైలో పెట్రోల్ రూ.104.22, డీజిల్ రూ.100.25కి చేరాయి.
ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.111.55కి చేరగా, డీజిల్‌పై 38 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.104.70కు పెరిగింది. ఇక నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.1కిపైగా పెరిగాయి. గత నెల 28 నుంచి ఈ నెల 23 వరకు 20 సార్లు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వాహనదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పనక్కరలేదు. అంటే 25 రోజుల్లో 20 సార్లు పెరిగినట్టు. ఈ 20 రోజుల్లో లీటరుకు రూ.5పైనే సామాన్యుడిపై భారం పడింది. ఇక డీజిల్ విషయానికి వస్తే.. గత నెల 24 నుంచి ఈ నెల 23 వరకు దాదాపు 23 సార్లు ధరలు ఎగబాకింది. అంటే 29 రోజుల్లో 23 సార్లు పెరిగినట్టు.
ఇక తెలంగాణలోని కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.71 ఉండగా, డీజిల్ రూ.104.85 ఉంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.27 ఉండగా, డీజిల్ ధర రూ. 104.43కు చేరుకుంది.
ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.49 ఉండగా, డీజిల్ ధర రూ.106.04 వద్ద ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.12 ఉండగా, డీజిల్ ధర రూ.105.65వద్ద కొనసాగుతోంది.