Income Tax Alert: 12 గంటల పాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్‌సైట్.. కారణం ఏంటంటే..!
Income Tax Alert: కొన్ని కొన్ని వెబ్‌సైట్లలో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతుంటాయి. అప్పుడప్పుడు బ్యాంకుకు సంబంధించిన వెబ్‌సైట్లు కొన్ని గంటల పాటు నిలిచిపోతుంటాయి...
Income Tax Alert: కొన్ని కొన్ని వెబ్‌సైట్లలో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతుంటాయి. అప్పుడప్పుడు బ్యాంకుకు సంబంధించిన వెబ్‌సైట్లు కొన్ని గంటల పాటు నిలిచిపోతుంటాయి. అలాంటి సమయంలో ఎలాంటి పనులు చేసుకునేందుకు వీలుండదు. ఇక ఇక తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. తమ వెబ్‌సైట్ వివిధ పనులలో భాగంగా దాదాపు 12 గంటల పాటు నిలిచిపోనుందని, దీనిని వినియోగదారులు గమనించాలని కోరింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపు పన్ను సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను వెబ్‌సైట్ https:///www.incometax.gov.in లో ప్రకటించింది. వెబ్‌సైట్ నిలిచిపోయిన కారణంగా ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
ఈ వెబ్‌సైటులో ఇతర సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ పోర్టల్‌లో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ను సిద్ధం చేసిన ఇన్ఫోసిస్ సంస్థ సీఈఓతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించి, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వెబ్‌సైటులో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబరు 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 2 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం ట్విటర్‌లో వెల్లడించింది.