AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Bullet Bhaskar: జబర్దస్త్‌కు రాక ముందు బుల్లెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? ఏడేళ్ల పాటు వైజాగ్‌లో..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగిన వాళ్లలో బుల్లెట్ భాస్కర్ ఒకడు. సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను తన కామెడీ టైమింగ్, ట్యాలెంట్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు.

Jabardasth Bullet Bhaskar: జబర్దస్త్‌కు రాక ముందు బుల్లెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? ఏడేళ్ల పాటు వైజాగ్‌లో..
Jabardasth Bullet Bhaskar
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 5:41 PM

Share

గత 13 ఏళ్లుగా ప్రసారమవుతోన్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా జబర్దస్త్ లో చేసిన చాలా మంది ఆర్టిస్టలుఉ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. అయితే ఎంతో ట్యాలెంట్ ఉన్నా, సినిమా అవకాశాలు వస్తున్నా జబర్దస్త్ లో కొనసాగుతోన్న కమెడియన్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బుల్లెట్ భాస్కర్. చాలా ఏళ్లుగా ఈ కామెడీ షోలో పని చేస్తున్నాడీ స్టార్ కమెడియన్. ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఇప్పుడు టీమ్ లీడర్ రేంజ్ కు ఎదిగాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోస్ చేస్తూ బుల్లితెరపై టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కాగా చాలా మంది లాగే భాస్కర్ కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా పనులు చేశాడట. ముఖ్యంగా జబర్దస్త్ లోకి రాకముందు బుల్లెట్ భాస్కర్ రేడియో జాకీ గా పనిచేశాడట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు రేడీయో జాకీగా సేవలందించాడట.

‘నేను రేడియో జాకీ గా పనిచేసే రోజుల్లో హైదరాబాద్ లో ఒక్క రేడియో స్టేషన్ కూడా ఉండేది కాదదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లోనే రేడియో స్టేషన్ ఉండేది. అక్కడ సుమారు ఏడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రేడియో స్టేషన్ హెడ్ గా కూడా వర్క్ చేశాను. వైజాగ్ లో రేడియో జాకీ గా పని చేసే రోజుల్లోనే , ఇండియా లోనే ‘ది బెస్ట్ రేడియో జాకీ’ గా అవార్డు ని కూడా అందుకున్నాను. ఆ తర్వాత కొంత మిస్ కమ్యూనికేషన్ కారణం గా వైజాగ్ నుంచి హైదరాబాద్ కి వచ్చేశాను. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం తిరగడం , యాదృచ్చికంగా ‘జబర్దస్త్’ లో ఛాన్స్ రావడం జరిగింది’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్.

ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం జబర్దస్త్ లో కొనసాగుతోన్న టాప్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకడు. ఫైమాతో కలిసి అతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. యూట్యూబ్ లోనూ భాస్కర్ స్కిట్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక భాస్కర్ లో ఉన్న మరో ట్యాలెంట్ మిమిక్రీ. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ని అద్బుతంగా ఇమిటేట్ చేస్తాడు భాస్కర్. వన్ నేనొక్కడినే చిత్రం లో మహేష్ బాబు కి పలు సన్నివేశాల్లో డబ్బింగ్ కూడా చెప్పాడట బుల్లెట్ భాస్కర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us