Viral Video: నాగుపాము పడగ విప్పి బుస కొడితే ఎట్లుంటదో తెలుసా.? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..
Viral Video: పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాముగా నాగు పాముకు పేరుంది. పొరపాటున నాగు పామును కవ్వించడానికి ప్రయత్నించామో ఇక అంతే..
Viral Video: పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాముగా నాగు పాముకు పేరుంది. పొరపాటున నాగు పామును కవ్వించడానికి ప్రయత్నించామో ఇక అంతే సంగతులు బుస కొట్టే చప్పుడుకే భయపడాల్సిందే. అయితే సాధారణంగా పాములు ఏక్కడో చెట్ల మధ్యలో, పొదల మధ్యలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది ఇంటిలోకి వచ్చి, డోర్ సందుల్లో తిష్ట వేసుకుంటే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ! కానీ ఇది నిజంగానే జరిగింది.
నేపాల్‌లోని ఘోరాహీ అనే పట్టణంలోని ఇంట్లోకి కోబ్రా వచ్చింది. వచ్చిన పాము వచ్చినట్లు ఉండకుండా, ఇంటి డోర్ సందుల్లోకి వెళ్లి బయటకు పడగవిప్పి చూస్తోంది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆ పామును వీడియో తీయడం ప్రారంభించారు. నన్నే వీడియో తీస్తారా.? అనుకుందో ఏమో.. ఒక్కసారిగా గట్టిగా బుస కొట్టింది. అయితే వీడియో తీస్తున్న వారు ఏ మాత్రం భయపడకుండా వీడియో తీయడం కంటిన్యూ చేశారు.
ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరీ ముఖ్యంగా పాము బుస కొడుతున్న సమయంలో వస్తోన్న సౌండ్ వింటే ఆశ్చర్యపోకమానరు. ఈ వైరల్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
Also Read: Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్స్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున.. కెప్టెన్సీ క్యాన్సిల్ అంటూ..
Protein Shake: డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే ప్రొటీన్ షేక్ తయారు చేయండి..! చాలా సులువు..
Protein Shake: డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే ప్రొటీన్ షేక్ తయారు చేయండి..! చాలా సులువు..