AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీకలదాకా తాగి డ్రైవింగ్.. అడ్డంగా బుక్కైన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎంత జరిమానా వేశారంటే?

David Warner Drink Driving: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సిడ్నీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడటంతో కోర్టు అతనికి భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన పరిమితికి మించి రెట్టింపు మోతాదులో మద్యం సేవించినట్లు విచారణలో తేలడంతో వార్నర్‌కు న్యాయపరమైన చిక్కులు తప్పలేదు. ఈ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

పీకలదాకా తాగి డ్రైవింగ్.. అడ్డంగా బుక్కైన మాజీ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్.. ఎంత జరిమానా వేశారంటే?
David Warner Drink Driving
Venkata Chari
|

Updated on: Aug 18, 2026 | 4:39 PM

Share

David Warner Drink Driving: తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు మైదానం వెలుపల అనూహ్యంగా ఒక ఊహించని వివాదంలో ఇరుక్కున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నేరాన్ని అంగీకరించి కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో అతను దొరికిపోయాడు. సాధారణంగా చట్టం అనుమతించిన ఆల్కహాల్ పరిమితి కంటే రెట్టింపు మోతాదులో అతను మద్యం సేవించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం స్థానిక సిడ్నీ కోర్టుకు చేరింది. పోలీసుల విచారణలో తన తప్పును అంగీకరించిన వార్నర్‌పై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఏకంగా 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.1,02,004లు) భారీ ఫైన్ విధించింది.

రెట్టింపు మోతాదులో ఆల్కహాల్..

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా పోలీసుల ప్రకారం వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు శరీరంలో ఆల్కహాల్ శాతం ఒక నిర్దిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఉండాలి. కానీ డేవిడ్ వార్నర్ ఆ చట్టబద్ధమైన పరిమితిని దాటి మిడ్-రేంజ్ డ్రంక్ డ్రైవింగ్‌కు పాల్పడినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదైంది. చట్టబద్ధంగా అనుమతించిన స్థాయి కంటే కచ్చితంగా రెండు రెట్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నట్లు వెల్లడైంది.  ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారుడిగా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి, పబ్లిక్ రోడ్లపైన ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విచారణ సమయంలో తన తప్పును ఏమాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా వార్నర్ తన నేరాన్ని కోర్టులో పూర్తిగా అంగీకరించాడు.

ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..!

ఇవి కూడా చదవండి

కెరీర్‌లో ఇలాంటి మచ్చలు కొత్తేమీ కాదు..

డేవిడ్ వార్నర్ ఇలాంటి తీవ్రమైన వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్న ఈ ఓపెనర్, అప్పట్లో భారీ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. కానీ మళ్లీ ఇప్పుడు ఇలాంటి చట్టవ్యతిరేక చర్యతో వార్తల్లో నిలవడం అతని వ్యక్తిగత ప్రతిష్టకు మచ్చ తెచ్చేదే.

ఎక్కువమంది చదివినది: వైభవ్ సూర్యవంశీ కంటే నేనే తోపు అన్నాడు.. కట్‌చేస్తే.. మైదానంలోనే పరువు పోగొట్టుకున్నాడుగా..!

మైదానంలో తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను అలరించిన డేవిడ్ వార్నర్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కన్విక్ట్ కావడం దురదృష్టకరం. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఈ వివాదం నుంచి గుణపాఠం నేర్చుకుని అతను భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us