Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? మీ హక్కులు ఏంటో తెలుసుకోండి

భారతీయ రైల్వేలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణికులు అత్యంత ఇష్టపడే మార్గాలలో ఒకటి. ప్రతి రోజు రైల్వే లక్షలాది మందిని గమ్యస్థానానికి చేరుస్తుంటుంది. టికెట్‌ రేట్లు తక్కువగా ఉండటంతో సౄమాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రయాణికుల కోసం..

Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? మీ హక్కులు ఏంటో తెలుసుకోండి
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2023 | 1:59 PM

భారతీయ రైల్వేలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణికులు అత్యంత ఇష్టపడే మార్గాలలో ఒకటి. ప్రతి రోజు రైల్వే లక్షలాది మందిని గమ్యస్థానానికి చేరుస్తుంటుంది. టికెట్‌ రేట్లు తక్కువగా ఉండటంతో సౄమాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంటుంది. అయితే ప్రతి రవాణా విధానం లాగానే రైల్వేలు కూడా కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయి. ఇవి ప్రయాణికులకు కొన్ని హక్కులు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

  1. మీ రైలు మిస్‌ అయితే సీటు వేరే వాళ్లకు కేటాయిస్తారా?: మీరు నిర్దేశించిన బోర్డింగ్ స్టేషన్ నుంచి కొన్ని కారణాల వల్ల రైలు ఎక్కడం మిస్ అయితే, టీసీ కనీసం ఒక గంట వరకు లేదా రైలు తదుపరి రెండు స్టాప్‌లను దాటే వరకు మీ బుక్ చేసిన సీటును మరెవరికీ కేటాయించలేరు. దీని వలన తదుపరి రెండు స్టేషన్లలో దేని నుంచి అయినా మీ రైలు ఎక్కే హక్కు మీకు ఉంటుంది.
  2. తత్కాలి టికెట్స్‌ రిఫండ్‌: రైల్వే విషయంలో ప్రయాణికులకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. మీరు తత్కాల్ టిక్కెట్లపై కూడా వాపసు పొందవచ్చు. రైలు 3 గంటలకు పైగా ఆలస్యమైనా, లేదా రూట్‌లో మార్పు జరిగినా, మీరు తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసినప్పటికీ మీ రీఫండ్‌ను క్లెయిమ్ చేయవచ్చు.
  3. ఇలా కూడా వాపస్‌ పొందవచ్చు: కొన్ని సమస్యల కారణంగా రైలు తన ప్రయాణాన్ని మార్గం మధ్యలో పూర్తి చేయలేకపోతే, రైల్వేలు ప్రత్యామ్నాయ ఏర్పాటును అందించలేకపోతే, మీరు బుక్ చేసిన టిక్కెట్‌పై పూర్తి వాపసు కోసం అర్హత పొందడం మీ హక్కు. రైల్వే ప్రత్యామ్నాయ ఏర్పాటును అందించినప్పటికీ, ప్రయాణికుడు అక్కడ ప్రయాణించడానికి ఇష్టపడకపోతే, టిక్కెట్ సరెండర్ చేసిన తర్వాత వారు మిగిలిన ప్రయాణంలో వాపసు పొందవచ్చు.
  4. ప్రయాణికులకు ఆటంకం: టీటీఈ ప్రయాణికుడిని డిస్టర్బ్ చేయలేరు. రాత్రి 10 గంటల తర్వాత వారి టిక్కెట్‌ తనిఖీ చేసే చేయరు. ఎందుకంటే అది నిద్రపోయే సమయం కాబట్టి ప్రయాణికులకు ఆటంకం కలిగించరు. అదేవిధంగా రైల్వే సర్వీస్ సిబ్బంది రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి ఆటంకం కలిగించకూడదనే నిబంధనలు ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. రైల్లో అస్వస్థత గురైతే: మీ ప్రయాణ సమయంలో మీకు అస్వస్థత గురైతే, లేదా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినట్లు అనిపిస్తే మీరు టీసీ, రైలు సూపరింటెండెంట్ మొదలైన ఏ రైల్వే ఉద్యోగి నుంచి అయినా మెడికల్ అసిస్టెంట్‌ని అడగవచ్చు. ప్రథమ చికిత్స అందించడం, అవసరమైతే వైద్య సహాయం అందించడం వారి విధి. భారతీయ రైల్వేలు ప్రయాణికులకు తదుపరి రైలు స్టాప్ వద్ద వైద్య చికిత్సను అందిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి