Bill Gates: అది కలా.. నిజమా..? భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో వచ్చే అతిపెద్ద మార్పు ఇదే: బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల లండన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తాను అది కలా, నిజమా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆ అనుభవాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ అటానమస్ వెహికల్స్‌దే అని పేర్కొన్నారు. గత వారం..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల లండన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా తాను అది కలా, నిజమా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆ అనుభవాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ అటానమస్ వెహికల్స్‌దే అని పేర్కొన్నారు. గత వారం ‘Hands Off The Wheel: The Rules Of The Road Are About To Change’ అనే బ్లాగ్ పోస్ట్‌లో, గేట్స్.. బ్రిటిష్ స్టార్టప్ వేవ్ అటానమస్ వాహనంతో తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే వేవ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కెండాల్, సేఫ్టీ ఆపరేటర్‌తో కలిసి ప్రయాణించిన గేట్స్.. వాహనం ఇంకా అభివృద్ధి దశలో ఉందని, చాలా తొందరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
లండన్‌లో ‘సెల్ఫ్ డ్రైవ్ జాగ్వార్’ కారులో ప్రయాణించిన బిల్ గేట్స్.. ఊహాజనిత అనుభవాల మిశ్రమంగా తన ప్రయాణం సాగిందన్నారు. భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో వచ్చే అతిపెద్ద మార్పు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలేనని ఆయన చెప్పుకొచ్చారు.
సెల్ఫ్ డ్రైవ్ వాహనాలు వచ్చేందుకు ఇంకా దశాబ్దాల సమయం..
అయితే ప్రపంచం పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవ్ వాహనాలకు మారడానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని బిల్‌గ్రేట్స్ అభిప్రాయపడ్డారు. కార్యాలయం పనిని వ్యక్తిగత కంప్యూటర్ ఏ విధంగా మార్చి వేసిందో మనం చూశామని, వాహన రంగంలో సెల్ఫ్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఇటువంటిదేనని ఆయన తన బ్లాగ్‌లోని స్టోరీలో బిల్‌గేట్స్ పేర్కొన్నారు. సెల్ఫ్ డ్రైవ్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరింత పురోగతి సాధిస్తామని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మేము మా గత డ్రైవింగ్ అనుభవాల నుంచి సేకరించిన జ్ఞానంపై ఆధారపడతామని అన్నారు.
I recently had the chance to test drive—or test ride, I guess—one of @wayve_ai’s autonomous vehicles. It was a pretty wild ride: https://t.co/PrwrxU49dd pic.twitter.com/NtnkVx7sBx
— Bill Gates (@BillGates) March 29, 2023
అయితే బిల్‌గేట్స్ ప్రయాణించిన కారు వేవ్ అనే స్టార్టప్ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో డెవలప్ చేసింది. ఇందుకోసం ఆ సంస్థ డీప్‌లెర్నింగ్ సాంకేతికతను వినియోగించిందని బిల్‌గేట్స్ చెప్పారు. మనిషి డ్రైవింగ్‌ను ఎలా నేర్చుకుంటారో అనుకరించడానికి వేవ్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించిందని.. ఇది అల్గారిథం ఆధారంగా నేర్చుకుంటుంది. ఈ విధనంలో డ్రైవింగ్.. వాస్తవ ప్రపంచం, దాని పరిసరాలను అర్థం చేసుకోవడానికి, అవసరమైన సమయంలో ప్రతిస్పందించడానికి కావలసిన చర్యలు చేపడుతుందని బిల్ గేట్స్ అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి