PPF: అలర్ట్.. అలర్ట్.. పీపీఎఫ్ ఖతాదారులకు ఈ ఒక్క రోజే అవకాశం.. లేకుంటే భారీగా నష్టపోతారు!

మీకు పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్(పీపీఎఫ్) ఖాతా ఉందా? ఈ ఏడాదికి అంటే 2023-24కు సంబంధించిన పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఇంకా చెల్లించలేదా? అయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ ఐదో తేదీలోపు మీ కంట్రిబ్యూషన్ డిపాజిట్ చేయండి.

PPF: అలర్ట్.. అలర్ట్.. పీపీఎఫ్ ఖతాదారులకు ఈ ఒక్క రోజే అవకాశం.. లేకుంటే భారీగా నష్టపోతారు!
PPF
Follow us
Madhu

|

Updated on: Apr 05, 2023 | 12:17 PM

సురక్షిత పెట్టుబడి పథకాలలో పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్(పీపీఎఫ్) కూడా ఒకటి. అధిక వడ్డీతో పాటు ప్రభుత్వ భద్రత కూడా ఉండటంతో ప్రజాదరణ పొందింది. మీలో చాలా మందికి పీపీఎఫ్ అకౌంట్ ఉండే ఉంటుంది. మీకు పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్(పీపీఎఫ్) ఖాతా ఉందా? ఈ ఏడాదికి అంటే 2023-24కు సంబంధించిన పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఇంకా చెల్లించలేదా? అయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఏప్రిల్ ఐదో తేదీలోపు మీ కంట్రిబ్యూషన్ డిపాజిట్ చేయండి. లేకపోతే పెద్ద మొత్తంలో వడ్డీని కోల్పోతారు. ఎందుకంటే పీపీఎఫ్ స్కీమ్ నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల ఐదో రోజు తర్వాత నుంచి నెల చివరి రోజు వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ ప్రకారం వడ్డీని లెక్కిస్తారు. ఎవరైనా పెద్ద మొత్తంలో పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు ఏప్రిల్ 5లోపు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారికి ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇదెలాగో ఓసారి చూద్దాం..

ఏడాదికి ఒకసారే వడ్డీ చెల్లింపు..

పీపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం.. పీపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌పై నెల వారీగా వడ్డీ లెక్కిస్తారు. కానీ, ఆర్థిక ఏడాది ముగింపులో ఖాతాలో జమ చేశారు. ఈ కారణంగా ఎవరైనా పీపీఎఫ్ ఖాతాలో నెలవారీగా డిపాజిట్ చేస్తున్నట్లయితే వారు ఎక్కువ వడ్డీ అందుకునేందుకు ప్రతి నెల 5వ తేదీలోపే జమ చేయడం ద్వారా మీరు జమ చేసిన డబ్బులకు వడ్డీ లెక్కిస్తారు.

ఈ ఉదాహరణ చూడండి..

ఓ వ్యక్తి తన పీపీఎఫ్ ఖాతాలోకి ఏప్రిల్ 4లోపు రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే ఆ డిపాజిట్ ఏప్రిల్ 5 లోపు చేసిన కారణంగా ఖాతాలో ఐదో రోజు నుంచి నెల చివరి రోజు వరకు చూసుకున్నట్లయితే కనిష్ఠ బ్యాలెన్స్ రూ.1.5 లక్షలుగా ఉంటుంది. దీంతో ఈ మొత్తం బ్యాలెన్స్ వడ్డీ లెక్కింపులోకి వస్తుంది. పీపీఎఫ్ ఖాతా వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ వస్తుంది. కాబట్టి రూ.1.5 లక్ష డిపాజిట్ చేసినట్లయితే రూ.10,050 వడ్డీ వస్తుంది. ఒకవేళ ఏప్రిల్ 5 తర్వాత డిపాజిట్ చేసినట్లయితే.. తొలి నెల వడ్డీ రేటును కోల్పోవాల్సి వస్తుంది. దీంతో 11 నెల వడ్డీ మాత్రమే వస్తుంది. అంటే రూ.1.5 లక్ష ఏప్రిల్ 5 తర్వాత డిపాజిట్ చేసినట్లయితే కేవలం రూ.9,762.50 మాత్రమే వస్తుంది.

ఇవి కూడా చదవండి

15 ఏళ్లు పీరియడ్..

పీపీఎఫ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇందులో లాకిన్ పీరియడ్ 15 ఏళ్లుగా ఉంటుంది. ప్రతి నెల ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 మధ్య రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే వడ్డీ రూపంలో రూ.18,18,209 వడ్డీ వస్తుంది. మొత్తంగా మెచ్యూరిటీ మొత్తం రూ.40,68,209 చేతికి అందుతుంది. ప్రతి ఆర్థిక ఏడాది చివర్లో మార్చి 5 తర్వాత డిపాజిట్ చేసినట్లయితే వడ్డీలో భారీ కోత పడుతుంది. కేవలం రూ.15,48,515 మాత్రమే వడ్డీ వస్తుంది. మొత్తంగా మెచ్యూరిటీ అమౌంట్ రూ.37,98,515కు పడిపోతుంది. మరోవైపు.. ఏప్రిల్ 5లోపు డిపాజిట్ చేసినట్లయితే ట్యాక్స్ మినహాయింపుతో పాటు ఎక్కువ వడ్డీ పొందవచ్చు.

ఇలా చేస్తే భారీగా ఆర్జించవచ్చు..

ఏడాది ఒకసారి కాకుండా ప్రతి నెలా ఐదో తేదీ లోపు పీపీఎఫ్ ఖాతాలో రూ. 12,500 చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ. 39,44,599 ఉంటుంది. ఇలా చేస్తే మొత్తం మీద రూ. 1,23,610 లను వడ్డీ రూపంలో అధికంగా మీరు పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..