Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలా..? ఇలా చేస్తున్నాడంటే మీపై ప్రేమ ఉన్నట్లే..!

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధం చాలా పవిత్రమైనది. ఆ బంధాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, కలకాలం ఆనందంగా గడపడానికి భార్యాభర్తల చేతుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల గొడవలతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఇద్దరు దంపతులిద్దరూ కూడా ..

Relationship Tips: మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలా..? ఇలా చేస్తున్నాడంటే మీపై ప్రేమ ఉన్నట్లే..!
Relationship Tips
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2023 | 7:43 AM

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధం చాలా పవిత్రమైనది. ఆ బంధాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, కలకాలం ఆనందంగా గడపడానికి భార్యాభర్తల చేతుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల గొడవలతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఇద్దరు దంపతులిద్దరూ కూడా కలిసిమెలసి ఉంటే ఆ కుటుంబం పచ్చని కాపురంలా ఉంటుంది. వారి జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఓపికతో నడుచుకోవాలి. అప్పుడే వారి కాపురం చక్కగా సాగిపోతుంటుంది. అప్పుడు వారి బంధం మరింత బలంగా తయారవుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగితే వెంటనే పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గి గొడవలు సద్దుమణిగేలా చూడాలి. అప్పుడు వారి బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయతలు ఉండాలి. మరి మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి. ఇలాంటి విషయాలను గమనిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.

  • ఏదైనా విషయాలు మీతో చెప్పినప్పుడు ఓపికగా వింటున్నారా? లేదా అనేది గమనించాలి. అలా మీరు చెప్పే విషయాలు ఓపిగా వింటున్నారంటే మీపై ప్రేమ ఉన్నట్లు గుర్తించాలి.
  • మీరు ఎంత పెద్ద తప్పు చేసినా మీపై మీ భర్త ఎలాంటి కోపానికి రాకుండా ఉన్నాడంటే మీపై ప్రేమ ఉన్నట్లు లెక్క.
  • భార్య కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకుంటుంది. అలాంటి సమయంలో మీ భర్త మీ అలవాట్లకు అనుగుణంగా నడుచుకుంటున్నాడంటే మీపై ప్రేమ కురిపిస్తున్నట్లుగా భావించాలి.
  • మీరు ఇలా కూడా మీ భర్త మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారని తెలుసుకోవచ్చు మీపై ప్రేమని ప్రతి నిమిషం మీ భర్త ఏదో విధంగా ప్రేమ కురిపించినట్లయితే మీరంటే ఆయనకి ఎంతో ఇష్టమైన తెలుసుకోవచ్చు.
  • మీ భర్త మీపై ఏదో ఒక రూపంలో ప్రేమని బయటపెడుతూ మిమ్మల్ని సంతోషంగా ఉంచినట్లయితే మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి.
  • మీరు అడగకముందే అన్ని చేసినా మీపై ప్రేమ ఉన్నట్లు గమనించాలి.
  • మీరు ఊరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని విడిచి ఉండలేకపోవడం కూడా మీపై ప్రేమ ఉన్నట్లే.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి